ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శక్తి కి ద్రక్తి కి ఒక్కడే
భక్తి కి ముక్తి కి ఒక్కడే దిక్కొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
నువ్వు రాయి వన్నాను లేనేలేవన్నాను
మంజునాధ మంజునాధ
పరికించె మనసు ఉంటే నీలోనె ఉన్నానన్నావు
లోకాలు దొరకాదు దొంగవని చాటాను
మంజునాధ మంజునాధ
నా పాప రాశులన్ని దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధరా
జయ జయ శంభో జయ జయ చంద్రధరా
నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాధ మంజునాధ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాధ మంజునాధ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే అవునొక్కడే
శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధరా
జయ జయ శంభో జయ జయ చంద్రధరా
శంకరా మురహరా శంభో హర హరా
మంజునాధ మంజునాధ మంజునాధ మంజునాధ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి