Keblinger

Keblinger

5, సెప్టెంబర్ 2015, శనివారం

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ


వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలుకస్తూరి రంగ రంగకస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా
కంసుణ్ణి సంహరింపా సద్గురుడు అవతారమెత్తెనపుడూ
దేవకీ గర్భమునను కృష్ణావవతారమై జన్మించెను

యేడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏక రాత్రిగ జేసెను
ఆదివారము పూటను అష్టమీ దినమందు జన్మించెను
తలతోను జన్మమైతే తనకుబహు మోసంబు వచ్చుననుచు
ఎదురు కాళ్లను బుట్టెను ఏడుగురు దాదులను జంపెనపుడు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

నెత్తురుతో ఉండి యపుడు ఆ బాల క్యావు క్యావున ఏడ్చెను
నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకీ వందనంబు
ఒళ్ళెల్ల హీనంబుతో ఈ రీతినున్నాను కన్న తండ్రి
నిన్నెట్లు యెత్తుకొందు నీ వొక్క నిముషంబు తాళరన్న

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

గంగను ప్రార్థించెను జలనిధుల గంగ తానుప్పొంగెను
గంగ నదిలోనప్పుడు దేవకీ జలకంబులాడెనపుడు
ఇకనైన ఎత్తుకొనవే నాతల్లి దేవకీ వందనంబు
కాని బాలుని వలేను నన్నిట్ల ఎడబాసి యుండతగునా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

నీపుణ్యమాయె కొడకా ఇంకొక్క నిముషంబు తాళమనుచు
కామధేనువు నప్పుడు దేవకీ అడగి ప్రార్థించగాను
పాల వర్షము గురిసెను అప్పుడా బాలుపై చల్లగాను
తడి వస్త్రములు విడిచెను దేవకీ పొడి వస్త్రములు కట్టెను

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

పొత్తిళ్ళ మీదనపుడు బాలుండు చక్కగా పవళించెను
తన రెండు హస్తములతో దేవకీ తనయుణ్ణి ఎత్తుకొనెను
అడ్డాలపై వేసుక ఆబాలు నందచందము జూచెను
వసుదేవ పుత్రుడమ్మ ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మ

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

నవనీత చోరుడమ్మ ఈ బిడ్డ నంద గోపాలుడమ్మ
సితపత్ర నేత్రుడమ్మ ఈ బిడ్డ శ్రీ రామ చంద్రుడమ్మ
శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము
పండ్లను పరుసవేది భుజమున శంఖు చక్రమ్ములు గలవు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

వీపున వింజామరా నా తండ్రి బొడ్దున పారిజాతం
అరికాళ్ళ పద్మములను అన్నియూ అమరేను కన్న తండ్రి
నీ రూపు నీచక్కన  ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసె తండ్రి
అన్నెకారి కడుపునా ఓ అయ్య ఏల జన్మిస్తివయ్య

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

మాయన్న కంసరాజు ఇప్పుడు-వచ్చు వేళాయెరన్నా
నిన్ను నేనెత్తుకోని ఏ త్రోవ నేగుదుర కన్న తండ్రీ
ఆ చక్కదనము జూచి దేవకీ  శోకింప సాగెనపుడు
తల్లి శోకము మాన్పగా మాధవుడు తంత్రమొక్కటి చేసెను

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

పెద్ద బొబ్బలు పెట్టుఛూ మాధవుడు గట్టిగా ఏడ్వ సాగె
శోకంబు చాలించియూ దేవకీ బాలుణ్ణి ఎత్తుకొనెను
నాయన్న ఊరుకోరా నా తండ్రి గోపాల పవళించరా
అల్లడుగొ బూచివాడు నా తండ్రి వస్తాడు పవళించరా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

బూచులను మర్దించను నళినాక్షి బుద్ధిమంతుడను అమ్మా
బూచేమి చేసునమ్మ నా తల్లి  బూచి నన్నెరుగునమ్మా
నీ పుణ్యమాయె కొడకా నీ వొక్క నిముషంబు తాళుమనుచూ
అల్లడుగొ జోగి వాడు నా తండ్రి వస్తాడు పవళించరా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

జోగి మందుల సంచులు ఏ వేళ నాచంక నుండగాను
జోగేమి చేసునమ్మ నా తల్లి జోగి నన్నెరుగునమ్మా
నీ పుణ్యమాయె కొడుకా నీవొక్క నిముషంబు తాళుమనుచు
అల్లదుగొ పాము వచ్చె నా తండ్రి గోపాల పవళించరా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

పాముల్ల రాజు అయిన శేషుండు  పాన్పుపై ఉండగాను
పామేమి జేసునమ్మ నళినాక్షి భయము నీకేలనమ్మ
నీల మేఘపు చాయలు నీ మేను నీలాల హారములను
సద్గురుండు వ్రాసినాడు నాతండ్రి నీ రూపు నీ చక్కనా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

నిన్ను నేనెత్తుకోని  ఏ త్రోవ పోదురా కన్న తండ్రి
నాకేమి భయము లేదే నా తల్లి నాకేమి కొదువ లేదే
మా మామ కంసుకుండు ఈ వేళ నన్ను చంపగ వచ్చెనా
మా మామ నా చేతను మరణమై పోయేది నిజము సుమ్మా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

వచ్చు వేళాయెననుచు నా తల్లి వసుదేవు పిలువనంపు
గోపెమ్మ బిడ్డనిపుడు శీఘ్రముగా తెచ్చి నీవుంచవమ్మా
అంతలో వసుదేవుడు  బాలుణ్ణి తలమీద ఎత్తుకొనెను
రేపల్లె వాడలోనూ  గోపెమ్మ ఇంటనూ వచ్చెనపుడు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

గోపెమ్మ పుత్రినపుడు వసుదేవు భుజముపై నెక్కించుకు
అతి త్వరితముగ వచ్చెను దేవకీ  హస్తములనుంచెనపుడు
దేవకికి తనయుడపుడు పుట్టెనని కంసునకు కబురాయెను
ఝల్లుమని గుండెలదర కంసుండు పీఠంబు దుమికెనపుడు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

జాతకంబులు జూచెను గండంబు తగిలెనని కంసుకుండు
చన్ద్రాయుధము దూసుకా శీఘ్రముగ దేవకీ వద్దకొచ్చె
తెమ్మని సుతునడిగెను దేవకీ అన్నది అన్నతోను
మగవాడు కాదు అన్న ఈ పిల్ల ఆడపిల్ల నమ్మరా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

ఉపవాసములు నోములు  నోచి ఈ పుత్రికను గంటినన్నా
పుత్రి దానము చేయరా నాయన్న పుణ్యవంతుడవురన్న
దేవాధి దేవులైన బ్రహ్మ రుద్రాదులకు పూజ జేసి
పూజ ఫలముల చేతను వారి కృప వల్ల పుత్రికను గంటి

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

నీ పుణ్యమాయెరన్నా నీవు పుత్రికను దయచేయుమన్నా
నిర్దయాత్మకుడవగుచు నీవిట్లు చేయుట తగదురన్నా
ప్రేమతో చెల్లెలపుడు అన్నను చే పట్టి  బ్రతిమాలెను
గంగాది నదులయందు పుత్రదానము చేయమని వేడెను

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

కాదు కాదని కంసుడు దేవకీ పుత్రికను అడిగెనపుడు
అడ్డాలపై బాలను పుచ్చుకుని ఎగరేసి నరకబోయె
అంబరమునకు ఎగురగా వేయనపుడా బాల కంసు జూచి
నన్నేల చంపెదవురా నీ యబ్బ రేపల్లె వాడలోను

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

పెరుగుతున్నాడు వినరా కృష్ణావతారమై జన్మించెను
నిజముగా దోచెనపుడు కంసుండు యేతెన్చి పవళించెను
రేపల్లె వాడలోను పెరుగుచున్నాడని దిగులొందెను
నీ యబ్బ నీ తాతరా కంసుడా కృష్ణుండు పుట్టెననుచూ

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

చల్లమ్ము వారలెల్ల ఆ కబురు చక్కగా చెప్పగాను
పూతకికు కబురాయెను అప్పుడా పూతకి చనుదెంచెను

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

శృంగారముగా పూతకీ స్తనములకు విషధార పూసుకొనెను
రేపల్లె వాడలందు కృష్ణుడు తిరుగుచున్నా చోటకు
చనుదెంచి విషపు పాలు ఇవ్వగా సమకట్టి ఇవ్వగాను
బాలురతొ బంతులాడ కృష్ణుని బాలురందరు కొట్టగా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

కావు కావున ఏడ్చుచూ పరుగెత్తి వీధి నడుమన నిలచెనూ
ప్రేమ క్రిష్ణుణ్ణి చూచి పూతకి ప్రియముతో బుజ్జగించి
నాయన్న ఊరుకోరా నా తండ్రి పాలు ఇచ్చెదను రారా
మూడు గుక్కలు తీర్చగా, పూతకి భూమిపై కొరిగిపడగా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

గోపెమ్మ చూచి అపుడూ బంగారు గిన్నెలో బువ్వ పెట్టి
ప్రొద్దున ఉగ్గు పోసి క్రిష్ణుణ్ణి ఒడిలోన  పండవేసె
అంతలో కంస హితుడు బండిరూపెదురుగా వచ్చి నిలిచే
పాదములు పిడుగుల వలె అంతలో దడదడా విసిరెనపుడు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

వృషభమై వచ్చి నిలువ ఒక్కలఘు చంపివేసెనపుడు
చల్లమ్ము వారలెల్ల ఈ  కబురు చల్లగా చెప్పిరపుడు
రేపల్లె వాడలోను ఉన్నట్టి  గోపికలు గుంపుకూడి
మా ఇళ్ళకొచ్చునమ్మ క్రిష్ణుడు మము రవ్వ జేసునమ్మ

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

తాళలేమమ్మ మేము మీ సుతుడు తాలిమితొ ఉండడమ్మ
ఇకనైన బుధ్ది చెప్పి ఇంతిరో పదిలమ్ము సేయుమమ్మ
అనుచు గట్టిగాను మనమంత గోపెమ్మ కడకు బోయి
చెపుదామనుచు వారు గోపెమ్మ  చెంతకేగనపుడు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

గోపాల కృష్ణుడపుడు  అచ్చటనె పాలు త్రాగుచూనుండెను
ఇదియేమి ఆశ్చర్యమే ఓ చెలియ ఇది యేమి చోద్యమమ్మ
కనుపాపలను దీసునే క్రిష్ణుడు దొంగతనములు జేసునె
ఇకనేమి జేసునోను మనంబులు పాతవమ్మున వస్తివమ్మా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

అమ్మ నేనెరుగనమ్మ నా త్రోవ నే బోవుచుండగాను
నను రవ్వ జేసిరమ్మ నేనెంత భయపడి వస్తినమ్మా
కొబ్బరికుడకలనుచు గొబ్బున పిలువ బోవ
కొబ్బరికుడకలనుచు గోపికలు గుబ్బలను జూపినారు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

పౌర్ణమీ రోజులందు జలజాక్షులందరూ కూడుకొని
చీరలటు తీసివేసి గోపికలు జలకమాడుచునుండగా
తీసి ఉంచిన చీరలు క్రిష్ణుడు వేసె ఆ పొన్న మీద
వేసియూ వేణు నాదం వూదుచూ ఉండెనా మాధవుడు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

జలకమ్ము చాలించియు గోపికలు మన చీరలేమాయెనె
నమ్మరాదే క్రిష్ణుని ఇకను ఈ చిన్న గొల్లవాని ఎపుడు
ఎంత పని జేసెనమ్మ ఓ చెలియ ఏమి ఆశ్చర్యమమ్మ
వెదుకుచు కొందరుండీ నీళ్ళలో మునిగియుండిరి కొందరు

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

అప్పుడూ గోపికలలో ఒక ఇంతి తా జూచె శ్రీక్రిష్ణుని
రారే ఓ అమ్మలారా ఈ పొన్న మీదున్న శ్రీక్రిష్ణుని
ఇవ్వరా మా చీరలు  ఓ క్రిష్ణ ఇవ్వరా మా రవికలు
దండంబు పెట్టెదమురా క్రిష్ణయ్య  దయయుంచి దయచేయరా

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

అందరూ ఒక చేతితో  దండంబు పెట్టగా చూచి తాను
పొందుగా మీరందరూ దండంబు రెండు చేతుల బెట్టరే
ఎంత పని వచ్చెననుచూ గోపికలు మానభంగము నొందిరి
వసుదేవ తనయునకును దండంబు రెండు చేతుల బెట్టిరీ

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

పొందుగా వలువలన్న క్రిష్ణుండు పేరు పేరున ఇచ్చెను
నాయత్త తిట్టునేమొ యనుచు నొకరొకరితో వగచిరపుడు
మాయాడు బిడ్డ ఇపుడు కొట్టునొ, నా బావ దండించునో
నా మగడు నన్ను బ్రతుకనివ్వడు నేనేమి జేతునమ్మ

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా

కంసుడ్ని సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు 
దేవకీ గర్భముననూ కృష్ణావతారమై జన్మించెను 

కస్తూరి రంగ రంగ! నాయన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ రంగ! నిన్ను బాసి నేనెట్లు మరచుందురా
Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)