ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్రఘండేతి కూష్మాండేతి చతుర్దశీ
పంచమస్కంధమాతేతీ, షష్ట్యా కాత్యాయనేతి చ
సప్తమా కాలరాత్రిశ్చ, అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చేతి, నవదుర్గాఃప్రకీర్తితాః
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఈ నవరాత్రులను దసరా అంటారు. శరత్కాలములో వచ్చే ఈ శరన్నవ రాత్రులలోనే అమ్మవారిని వివిధ అలంకారాలతో అలంకరించి, శరణు కోరుతూ పూజించి, నైవేద్యాలు సమర్పిస్తుంటాము. చెడు మీద విజయం సాధించటానికి ఆదిపరాశక్తి తన అంశలతో విభిన్న రూపాలలో అవతరించింది .. . అవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సర్వసిద్ధిధాత్రి అనే నవ రూపాలు. వీటినే నవదుర్గలుగా కొలుస్తాం.
ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు రాజేశ్వరి అవతారంలో రాక్షససంహారం చేసింది. మాతా రాజ రాజేశ్వరి ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో సకల విజయాలు ప్రసాదిస్తుంది.
నైవేద్యంగా చిత్రాన్నం ( పులిహోర ), లడ్డూలు, అరటిపళ్ళు సమర్పించి,
"ఓం శ్రీ మాత్రే నమః" అనే మంత్రం జపించి అమ్మవారిని పూజించాలి ..
విజయదశమి రోజు ప్రారంభించే ఏ పనైనా అమ్మదయవల్ల దిగ్విజయంగా పూర్తవుతుందని భక్తుల నమ్మకం . ఈ నవరాత్రులలో సాయత్రం ఆరు తర్వాత చేసే అమ్మవారి పూజ విశేష ఫలితాలను ఇస్తుందని చెప్తారు .
__/\__ ఓం శ్రీ మాత్రే నమః __/\__
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి