నీలకంధరా దేవా దీనబాంధవా రారా..
జయ జయ మహాదేవ శంభో సదాశివా
ఆశ్రిత మందారా శ్రితిశిఖర సంచారా
నీలకంధరా దేవా దీనబాంధవా రారా
నన్ను గావరా
సత్యసుందరా స్వామీ నిత్య నిర్మలా పాహీ
సత్యసుందరా స్వామీ నిత్య నిర్మలా పాహీ
నీలకంధరా దేవా దీనబాంధవా రారా
నన్ను గావరా
అన్య దైవము గొలువ నీదు పాదము విడువ
అన్య దైవము గొలువ నీదు పాదము విడువ
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
దర్శనమ్ము నీరా మంగళాంగ గంగాధరా
నీలకంధరా దేవా దీనబాంధవా రారా
నన్ను గావరా
దేహియన వరములిడు దానగుణశీమా
పాహి యన్నను ముక్తి నిడు పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణా
ఏమరక చేయుదును భవతాప హరణా
నీ దయామయ దృష్టి దురితమ్ములారా
వరసుధావృష్టి నా వాంఛ లీడేర
కరుణించు పరమేశ దరహాస భాసా
హర హర మహాదేవ కైలాస వాసా... కైలాస వాసా
ఫాలలోచన నాదు మొర విని జాలిని బూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొర విని జాలిని బూనవయా
నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా
కన్నుల విండుగ భక్త వత్సల కానగరావయ్యా
కన్నుల విండుగ భక్త వత్సల కానగరావయ్యా
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమ మీరా నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొర విని జాలిని బూనవయా
నాగభూశణ నన్ను గావగ జాగును సేయకయా
శంకరా! శివశంకరా! అభయంకరా! విజయంకరా!
శంకరా! శివశంకరా! అభయంకరా! విజయంకరా!
భూ కైలాస్ - (1958)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి