శ్రుతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతీ
ఈ నా కృతి నీవు భారతీ
ఈ నా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతీ
శ్రుతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతీ
ధ్రుతి నీవు ద్యుతి నీవు
శరణాగతి నీవు భారతీ
ధ్రుతి నీవు ద్యుతి నీవు
శరణాగతి నీవు భారతీ
శరణాగతి నీవు భారతి ... శరణాగతి నీవు భారతీ
నీ పదములొత్తిన పదము ఈ పదము
నిత్య కైవల్య పధము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు
నిగమార్ధ నిధులున్న నెలవు
కోరినా మిగిలిన కోరికేమి నిను కొనియాడు
కృతుల పెన్నిధి తప్ప
చేరినా యిక చేరువున్నదేమి నీ శ్రీచరణ
దివ్యసన్నిధి తప్ప
శ్రుతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతీ
ధ్రుతి నీవు ద్యుతి నీవు
శరణాగతి నీవు భారతీ
శ్రీనాధ కవినాధ శృంగార కవితా
తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు
కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రాజిల్లిన
అనంత రాగాలు నీ మూర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం
జననీ భవతారక మంత్రాక్షరం
శరణాగతి నీవు భారతీ
శరణాగతి నీవు భారతి ... శరణాగతి నీవు భారతీ
నీ పదములొత్తిన పదము ఈ పదము
నిత్య కైవల్య పధము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు
నిగమార్ధ నిధులున్న నెలవు
కోరినా మిగిలిన కోరికేమి నిను కొనియాడు
కృతుల పెన్నిధి తప్ప
చేరినా యిక చేరువున్నదేమి నీ శ్రీచరణ
దివ్యసన్నిధి తప్ప
శ్రుతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతీ
ధ్రుతి నీవు ద్యుతి నీవు
శరణాగతి నీవు భారతీ
శ్రీనాధ కవినాధ శృంగార కవితా
తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాణి అలరించు
కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రాజిల్లిన
అనంత రాగాలు నీ మూర్తులే
నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం
జననీ భవతారక మంత్రాక్షరం
2 కామెంట్లు:
స్వాతికిరణం పాటలు విన్న ప్రతిసారీ
ఎందుకో కళ్ళవెంట నీళ్ళు తిరుగుతాయి రాజి గారూ!...
ఆనతి నీయవా...శివాని...చక్కటి పాటలు...
మంచి పాటను మా ముందుంచారు...ధన్యవాదాలు...@శ్రీ
"శ్రీ" గారూ స్వాతికిరణం పాటలు
నాకు కూడా ఇష్టమండీ నిజంగా చాలా మంచి పాటలు..
మీ స్పందనకు ధన్యవాదములు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి