చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా...
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలి జో లాలి
వేపతోవిసిరి నీకు పూజలు చేసే వేళ
తల్లిరో నిదురించు లాలీ జో లాలి
ఈ జగతినేలే తల్లికి కన్నబిడ్డ నేనేగా
కలలతేలి పోవమ్మా నన్నుగన్న తల్లి
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలీ జో లాలి
పామే తలదిండు ... వేపాకే పూలపక్క
తల్లి శయనిస్తే జోలాలి పాడె బిడ్డా
ఎన్నినాళ్ళ పుణ్యమో ఈ వరం దొరికేనే
ఆనందం పొంగెనమ్మ వెల్లువల్లే కన్నుల
దేవీ మహదేవీ ఏ సేవచేయగలనే
పాదం నీ పాదం సర్వదోషాలు తొలగించునే
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలీ జో లాలి
గోరుముద్దలందించి తినిపిస్తే వేడుకగా
భువనం పులకించి మరచునమ్మ ఆకలినీ
మదిలో వ్యధ నీకు విన్నవిస్తే చాలునుగా
వ్యధలే కనిపెట్టి మోక్షమిచ్చు మాతవుగా
దేవీ మహాదేవీ నీ దీవెన చాలునమ్మా
నీవే మా సర్వం అని నమ్మిన వారమమ్మా
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలీ జో లాలి
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలి జో లాలి
వేపతోవిసిరి నీకు పూజలు చేసే వేళ
తల్లిరో నిదురించు లాలీ జో లాలి
ఈ జగతినేలే తల్లికి కన్నబిడ్డ నేనేగా
కలలతేలి పోవమ్మా నన్నుగన్న తల్లి
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాతా
చల్లగా శయనించు లాలి జో లాలి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి