Keblinger

Keblinger

12, అక్టోబర్ 2012, శుక్రవారం

కనకధారా స్తోత్రం





కనకధారా స్తోత్రం





అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ
బృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః || 1 ||

ముగ్దా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని |
మాలాదృశో ర్మధుకరీవ మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగర సంభావాయాః || 2 ||

ఆమీలితాక్ష మధిగ్యమ ముదా ముకుంద
మానంద కంద మనిషేష మనంగ నేత్రమ్ |
అకేకర స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః ||
3 ||

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతో‌உపి కటాక్షమాలా
కళ్యాణ మావహతు మే కమలాలయాయాః || 4 ||

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
దారాధరే స్ఫురతి యా తటిదంగ నేవ |
మాతస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః || 5 ||

 ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన |
మయ్యపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం మకరాలయ కన్యకాయాః || 6 ||

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షం 
మానంద హేతు రధికం మురవిద్విషోపి |
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్థం
ఇందీవరోదర సహోదర మిందియాయాః || 7 ||
  
ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్రదృష్ట్యా
 త్రివిష్ట పపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తి రిష్టాం
పుష్టి కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః || 8 ||

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబు ధారా
మస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్మర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబు వాహః || 9 ||

గీర్ధవ తేతి గరుడద్వజ సుందరీతి
శాకంభరీతి శశశేఖర వల్లభేతి |
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై || 10 ||

శ్రుత్యై నమో‌స్తు శుభకర్మ ఫలప్రశూత్యే
రత్యై నమో‌స్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమో‌స్తు శతపత్ర నికేతనాయై  
పుష్ట్యై నమో‌స్తు పురుషోత్తమ వల్లభాయై || 11 ||

నమో‌స్తు నాళీక నిభాననాయై
నమో‌స్తు దుగ్దోదధి జన్మభూమ్యై |
నమో‌స్తు సోమామృత సోదరాయై
నమో‌స్తు నారాయణ వల్లభాయై || 12 ||

నమో‌స్తు హేమాంబుజ పీఠికాయై
నమో‌స్తు భూమండల నాయికాయై |
నమో‌స్తు దేవాది దయా పరాయై
నమో‌స్తు శార్ జ్ఞాయుధ వల్లభాయై || 13 ||

నమోస్తు దేవ్యై  భృగు నందనాయై 
నమోస్తు విష్ణో రుర సిస్థితాయై |
నమోస్తు లక్ష్మై కమలాలయాయై 
నమోస్తు దామోదర వల్లభాయై || 14 ||
 నమో‌స్తు కాన్యై కమలేక్షణాయై
నమో‌స్తు భూత్యై భువన ప్రసూత్యై |
నమో‌స్తు దేవాదిభి రర్చితాయై
నమో‌స్తు నందాత్మజ వల్లభాయై || 15 ||

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలర్థ సంపదః |
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే || 17 ||

సరసిజనిలయే సరోజహస్తే
దవళ తమాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యమ్ || 18 ||

దిగ్ఘస్తభిః కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ
 విమలచారు జల ప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీ
మశేష లోకధినాథ గృహిణీ మమృతాబ్ది పుత్రీమ్ || 19 ||

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః |
అవలోకయ మా మకించనానం
ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయాః || 20 || 

స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్ |
గుణాధికా గురుతుర భాగ్య భాజినో  
భవంతి తే భువి బుధ భావితాశయాః || 21 ||

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం  
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం కుబేర సమో భవేత్

 

14 కామెంట్‌లు:

శ్రీ చెప్పారు...

క్లిష్టమైన పదాలతో , సమాసాలతో
ఆది శంకరాచార్యుల విరచితమైన ఈ కనకధారాస్తవం
అద్భుతంగా ఉంటుంది...
మంచి పోస్ట్ రాజి గారూ !...
@శ్రీ

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పోస్ట్ నచ్చినందుకు థాంక్యూ శ్రీ గారూ..

భాస్కర్ కె చెప్పారు...

ఉదయన్నే ఓ మంచి ఫీలింగ్

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..
ThankYou!

భారతి చెప్పారు...

రాజీ గారు!
'భక్తి ప్రపంచం' బ్లాగ్ దర్శనం - దేవాలయంలో ఉన్నంత పారవశ్యమును కల్గిస్తుంది.
భక్తితత్వప్రేరకం ఈ బ్లాగ్. భక్తిత్వంతో అలరారేటట్లు ప్రత్యేకంగా ఈ బ్లాగ్ని తీర్చిద్దిద్దారు. అభినందనలండి.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"భారతి" గారూ..
నా భక్తిప్రపంచం మీకు నచ్చినందుకు,దేవాలయంతో పోల్చినందుకు చాలా సంతోషమండీ..

బ్లాగ్ నచ్చినందుకు,మీ అభినందనలకు ధన్యవాదములు..

Unknown చెప్పారు...

if possibul sree stuthi pl put dis web... thank you..

murali acharya

Unknown చెప్పారు...

if possible pl put SREE STUTHI.

Unknown చెప్పారు...

if possibul sree stuthi pl put dis web... thank you..

murali acharya

Shree చెప్పారు...

(వందే వందారు...) -- భక్తుల కోర్కెలు తీర్చేవాడు, లక్ష్మీదేవికి ఆనందము కూర్చువాడు, జ్ఞానులకు ఆరాధ్యుడు అయిన హయగ్రీవునికి వందనము.

(అంగం హరే: పులక భూషణం ...) -- నీలమేఘశ్యాముడైన హరిని తన చూపులతో చుట్టివేసిన మంగళమూర్తి, సకలసిద్ధిస్వరూపిణి అయిన శ్రీలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములను ప్రసాదించును గాక !

(ముగ్ధా ముహుర్విదధతీ .. ) -- కమలము చుట్టు పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక !

(విశ్వామరేంద్ర ...) -- దేవేంద్ర పదవిని సైతము ప్రసాదింపగలిగిన, ఎల్ల ఆనందములకును మూలమైన, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగింపగల శ్రీ మహాలక్ష్మీ మాత నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించు గాక !

(కాలాంబుదాళి...) -- విష్ణుమూర్తి నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !

(బాహ్యాంతరే మురజిత: ...) శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !

(ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ...) శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు మన్మధునకు స్థానము కల్పించిన లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !

(దద్యాద్ దయానుపవనో ...) -- లక్ష్మీదేవి చల్లని చూపులు ఈ దరిద్రుడనెడి విచారగ్రస్తునిపై దయతో వాలి, ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !

(ఇష్టా విశిష్ట మతయో౭పి ...) -- ఆ తల్లి కరుణార్ద్ర దృష్టి వలన ఆశ్రితులైన పండితులకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించు గాక !

(గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ...) -- విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమ.

Shree చెప్పారు...


(శ్రుత్యై నమో౭స్తు ...) -- శుభముల నొసంగు వేదమాతృ రూపురాలైన లక్ష్మీదేవికి, ఆనందగుణ సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు, నూర దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి, విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి దండములు.

(నమో౭స్తు నాళీక నిభాననాయై ...) -- పద్మము వంటి ముఖము గలిగినది, పాల కడలిలో జన్మించినది, అమృతమునకును చంద్రునికిని తోబుట్టువైనది, నారాయణునకు ప్రేమాస్పదురాలైనది అయిన లోకమాతకు దండములు.

(నమో౭స్తు హేమాంబుజ పీఠికాయై ...) -- బంగారు పద్మముపై ఆసీనయైనది, సమస్త భూమండలమునకు నాయిక అయినది, దేవాదులకు దయ జూపునది, శార్ఞ్గమను ధనుస్సును ధరించిన విష్ణుమూర్తికి ప్రియముకూర్చునది అయిన శ్రీ కమలాదేవికి దండములు.

(నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై ...) -- భృగుమహర్షి బిడ్డయైనది, విష్ణువు వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు దామోదరప్రియాదేవికి నమస్కారము.

(నమో౭స్తు కాంత్యై కమలేక్షణాయై ...) -- కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి, సకల భువనములకు తల్లియైనది, దేవాదులచే పూజింపఁబడునది, నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని ప్రేమను చూరగొన్నదియగు శ్రీదేవికి దండములు.

(సంపత్కరాణి ...) -- తల్లీ! మహాలక్ష్మీ ! మేము నీకుఁ జేయు వందనములు మాకు సంపదలను, సుఖములను గలిగించునవి.సామ్రాజ్యమును సైతము ప్రసాదింప జాలినవి. పాపములను హరించునవి. అవి నన్నెల్లప్పుడును వీడకుండును గాక !

(యత్కటాక్ష సముపాసనా విధి: ..) -- హే మహాలక్ష్మీ ! ఎవరి కటాక్షమును గోరుచు మనసా, వాచా, కర్మణా ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో, అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను.

(సరసిజ నయనే సరోజ హస్తే ...) -- కమలములవంటి కన్నులు గలది, కమలములు చేత ధరించినది, తెల్లని వలువలు, గంధము, పూలమాలలతో ప్రకాశించునది, సౌందర్యమూర్తి అయిన శ్రీమహాలక్ష్మీ! నీవు ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానవు. హే భగవతీ ! హరివల్లభా! శ్రీ మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము !

(దిగ్ దంతిభి: కనక కుంభ ముఖావసృష్ట ...) -- జననీ! సకలలోకాధినాధునకు గృహిణీ! క్షీర సముద్రరాజ పుత్రీ! దిగ్గజముల భార్యలు (అడు యేనుగులు) బంగారు కలశముల యందు పట్టి తెచ్చిన ఆకాశగంగ విమల జలములతో అనునిత్యమున్ను స్నానము చేయు జగజ్జననీ! శ్రీశ్రీ మహాలక్ష్మీ! నీకు ప్రాతఃకాలములో నమస్కరిస్తున్నాను.

(కమలే కమలాక్ష వల్లభే ... ) -- అమ్మా ! కమలాదేవీ ! దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందఱి కంటె ముందు నేనే పాత్రుడనగుదును. నా మాటలలో నటన (కృత్రిమత్వము) లేదు. కనుక నీ కరుణాపూరిత కటాక్షముల (ఓరచూపుల)తో నన్నొకమారు చూడుము తల్లీ ! దేవీ ! ముకుందప్రియా !

Shree చెప్పారు...


(బిల్వాటవీ మధ్య లసత్సరోజే ...) -- మారేడు చెట్ల తోట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతినుండి జారవిడచుచున్నదియు నైన శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను.

(కమలాసన పాణినా ...) -- ధనికుల యిళ్ళ ముంగిట పడికాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుడు ఈ హీనజీవి యొక్క నుదుట వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచి వేయుమమ్మా! తల్లీ! శ్రీ మహాలక్ష్మీ !

(అంభోరుహం జన్మగృహం భవత్యా: ...) -- హే పద్మాలయా దేవీ ! నీ పుట్టినిల్లు కమలము. మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని దానిని నీ కేళీగృహముగా జేసికొనుము.

(స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం ...) -- వేదమాతయు, జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రతి దినమున్ను ఈ స్తోత్రము ద్వారా సేవింతురో, వారు తమ సద్గుణములచేత ఇతరుల కంటె అధికులై, విద్వాంసుల చేత గౌరవింపఁబడుచు మిక్కిలి సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు.

ఫలశ్రుతి: (సువర్ణ ధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితమ్ త్రిసంధ్యం య: పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్) - ఆదిశంకరులు కూర్చిన ఈ కనకథారా స్తవమును దినమునకు మూడు సంధ్యలలో పారాయణము చేసినవారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

కనకధారా స్తోత్రం వివర
ణతో పోస్ట్ చేసినందుకు ధన్యవాదములు 'Shree' గారూ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"mohan murali" గారు

శ్రీ సూక్తం ఈ లింక్ లో చూడండి పోస్ట్ చేశాను ..

Thank You ..


http://raaji-bhaktiprapancham.blogspot.in/2014/06/blog-post.html

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)