సతులాల ఓ సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు
సతులాల ఓ సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు
ఆట్టే కిరీటము ఆభరణాలు ధరించియెట్ట
నెదుట నున్నాడు యీ కృష్ణుడు
ఆట్టే కిరీటము ఆభరణాలు ధరించియెట్ట
నెదుట నున్నాడు యీ కృష్ణుడు
సతులాల ఓ సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు
వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతియించగాను
యిచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు
వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతియించగాను
యిచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చిన మహిమలతో యీ కృష్ణుడు
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చిన మహిమలతో యీ కృష్ణుడు
సతులాల ఓ సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు
కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ గూడి
యెదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ గూడి
యెదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు
సతులాల ఓ సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
కతలాయ నడురేయి గలిగె శ్రీకృష్ణుడు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
4 కామెంట్లు:
రాజి గారు
అద్భుతమైన పాట పెట్టేరు. కన్నయ్యను మీ బ్లాగులోనూ దర్శించాని. నా బ్లాగులోనూ ఒక పాట పెట్టేను చూసి ఎలా ఉందో చెప్పండి.
రాజి గారూ!
యశోదానందనునికి మీ పాటల నివాళి చక్కగా ఉంది...
మీకు కూడా శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...
ఆ నల్లని చల్లని స్వామీ ఆశీస్సులు సదా మీ వెంట ఉండు గాక...
@శ్రీ
"kastephale" గారూ..
కృష్ణాష్టమి సందర్భంగా నేను పోస్ట్ చేసిన పాటలు,కీర్తనలను చూసి మెచ్చుకుని,ప్రోత్సహించిన మీకు ధన్యవాదములండీ..
మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు..
"శ్రీ" గారూ..
నేను కన్నయ్య కొసం పోస్ట్ చేసిన పాటలు,కీర్తనలను
"గాన సుమాలు"గా వర్ణించి అభినందించినందుకు,
మీ శుభాకాంక్షలకు ధన్యవాదములండీ..
ఆ నల్లని కన్నయ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మీకు కూడా
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి