Keblinger

Keblinger

8, ఆగస్టు 2012, బుధవారం

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు



ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు






ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని
మహిమల దేవకీ సుతుడు
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని
మహిమల దేవకీ సుతుడు

అంతనింత
గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే
కంసునీ పాలి వజ్రము
కాంతుల
మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల
మాలోనున్న చిన్ని కృష్ణుడు

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు

దిద్దరాని
మహిమల దేవకీ సుతుడు

రతికేళి
రుక్మిణికి రంగుమోవి పగడము
మితి
గోవర్ధనపు గోమేధికము
సతమైన శంఖచక్రాల సంతుల వైఢూర్యము
గతియై
మమ్ము గాచే కమలాక్షుడు

ముద్దుగారే
యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని
మహిమల దేవకీ సుతుడు

కాళింగుని
తలలపై గప్పిన పుష్యరాగము
ఏలేటి
శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలధిలోన
బాయని దివ్యరత్నము
బాలుని
వలె తిరిగే పద్మనాభుడు

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని
మహిమల దేవకీ సుతుడు

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

గొప్ప కీర్తన పెట్టేరు. చాలా బాగుంది. రేపేమిటో?

భాస్కర్ కె చెప్పారు...

మంచి పాట వినిపించారు,ధన్యవాదాలు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"kastephale" గారూ..
కీర్తన నచ్చినందుకు ధన్యవాదములండీ..
రేపు కూడా ఒక మంచి కీర్తనను కన్నయ్యకు కానుకగా ఇవ్వాలనుకుంటున్నానండీ

తప్పకుండా చూసి మెచ్చుకుంటారు కదా ..

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"the tree" గారూ..
పాట నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములండీ..

శ్రీ చెప్పారు...

రాజి గారూ!
మంచి కీర్తన...
నాకు ఇష్టమైన కీర్తనలలో ఇది ఒకటి...
@శ్రీ

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

శ్రీ గారూ..
కీర్తన నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదములండీ..

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)