Keblinger

Keblinger

8, డిసెంబర్ 2014, సోమవారం

యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు



యమధర్మరాజు యక్షుడి రూపంలో అడిగిన 72 చిక్కు ప్రశ్నలు  
వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు


1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు?
(బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు?
(దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది?
(ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు?
(సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును?
(వేదం)

6. దేనివలన మహత్తును పొందును?
(తపస్సు)

7. మానవునికి సహయపడునది ఏది?
(ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
(పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
(అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి?
తపస్సువలన,సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల
అసాధుభావము సంభవించును.

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మౄత్యు భయమువలన)

12. జీవన్మౄతుడెవరు?
దేవతలకూ,
అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు

13. భూమికంటె భారమైనది ఏది?
(జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది?
(తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది?
(మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది?

ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది

17. తౄణం కంటె దట్టమైనది ఏది?
(చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది?
(చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు?
( అస్త్రవిద్యచే)

20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ణ్జం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది
(గుడ్డు)

22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది?
(రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది?
(శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది?
(నది)

25. రైతుకు ఏది ముఖ్యం?
(వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు?

(సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది?
(దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది?
 (దానం)

29. దేవలోకానికి దారి ఏది?
(సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది?
(శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు?
(భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు?
( కూమారుడు)

33. మానవునకు జీవనాధారమేది?
(మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును?
(దానం)

35. లాభాల్లో గొప్పది ఏది?
 (ఆరోగ్యం)

36. సుఖాల్లో గొప్పది ఏది?
(సంతోషం)

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది?
(అహింస)

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది?
(మనస్సు)

39. ఎవరితో సంధి శిధిలమవదు?
(సజ్జనులతో)

40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది?
(యాగకర్మ)

41. లోకానికి దిక్కు ఎవరు?
(సత్పురుషులు)

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి?
(భూమి,ఆకాశములందు)

43. లోకాన్ని కప్పివున్నది ఏది?
(అజ్ణ్జానం)

44. శ్రాద్ధవిధికి సమయమేది?
(బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)

45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును?
( వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)


46. తపస్సు అంటే ఏమిటి?
 ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)

47. క్షమ అంటే ఏమిటి?
( ద్వంద్వాలు సహించడం)

48. సిగ్గు అంటే ఏమిటి?
(చేయరాని పనులంటే జడవడం)

49. సర్వధనియనదగు వాడెవడౌ?
 ( ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు)

50. జ్ణ్జానం అంటే ఏమిటి?
 (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)

51. దయ అంటే ఏమిటి?
 ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)

52. అర్జవం అంటే ఏమిటి?
( సదా సమభావం కలిగి వుండడం)

53. సోమరితనం అంటే ఏమిటి?
(ధర్మకార్యములు చేయకుండుట)

54. దు:ఖం అంటే ఏమిటి?
( అజ్ణ్జానం కలిగి ఉండటం)

55. ధైర్యం అంటే ఏమిటి?
( ఇంద్రియ నిగ్రహం)

56. స్నానం అంటే ఏమిటి?
(మనస్సులో మాలిన్యం లేకుండాచేసుకోవడం)

57. దానం అంటే ఏమిటి?
( సమస్తప్రాణుల్ని రక్షించడం)

58. పండితుడెవరు?
( ధర్మం తెలిసినవాడు)

59. మూర్ఖుడెవడు?
(ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)

60. ఏది కాయం?
 ( సంసారానికి కారణమైంది)

61. అహంకారం అంటే ఏమిటి?
( అజ్ణ్జానం)

62. డంభం అంటే ఏమిటి?
 (తన గొప్పతానే చెప్పుకోవటం)

63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును?
(తన భార్యలో, తనభర్తలో)

64. నరకం అనుభవించే వారెవరు?
 (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది?
(ప్రవర్తన మాత్రమే)

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది?
(మైత్రి)

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు?
(అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు)

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
(సుఖపడతాడు)

69. ఎవడు సంతోషంగా ఉంటాడు?
(అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు)

70. ఏది ఆశ్చర్యం?
 ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)

71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు)

72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు?

(నిందాస్తుతులందూ,శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,
సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై
ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

2 కామెంట్‌లు:

dokka srinivasu చెప్పారు...

Rajyalaxmi madam garu Namaskaramu.Mee blog chaalaa chaalaa bagundi madam garu. Mee blog choosi anandam vesindi.

Madam garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.

http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html

Madam garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your inspirational and valuable comment in english language.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"dokka srinivasu" గారు నమస్తే అండీ..
నా బ్లాగ్ నచ్చినందుకు,మీ అభినందనలకు ధన్యవాదాలు..

మీ బ్లాగ్ చూశాను.. indian-heritage-and-culture గురించి మీ సెమినార్,మీరు సేకరించిన సొంతగా వేసిన పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి.మన పురాణాల్లోని పాత్రలను వైవిధ్యంగా చిత్రించే మధుబని పెయింటింగ్స్ నాకు చాలా ఇష్టం.. పిల్లలకు మీ collections ద్వారా మన సంస్కృతిని,సాంప్రదాయాలను తెలియచేయటం చక్కని ప్రయత్నం..

Thank You ..

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)