ఓం నమఃశ్శివాయ ..
ఓం .. ఓం .. ఓం ..
ఓం నమఃశ్శివాయ .. ఓం నమఃశ్శివాయ
చంద్ర కళాధర సహృదయా
చంద్ర కళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణవోదయా లయనిలయా
ఓం నమఃశ్శివాయ .. ఓం నమఃశ్శివాయ
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరసప్తకమై
సా గా మ దనిస దగమద ని సా స స స స
గగగ ససస నిగ మదసని దమగస
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా .. ఆ ఆ
నీ మౌనమే .. దషోపనిషత్తులై ఇల వెలయా
ఓం .. ఓం .. ఓం నమఃశ్శివాయా
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమధాదులు
నీ సంకల్పానికి రుత్విజవరులై
అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా
ఓం .. ఓం .. ఓం నమఃశ్శివాయ
చంద్ర కళాధర సహృదయా
సాంద్రకళా పూర్ణవోదయా లయనిలయా
2 కామెంట్‌లు:
బ్లాగ్ వేదికను సంప్రదించినందుకు ధన్యవాదములు.మీ బ్లాగులను బ్లాగు వేదికకు జతచేసాము.గమనించగలరు.బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగులకు అతికించి సహకరించగలరు.త్వరలో మరిన్ని ఫీచర్స్ తో మీముందు కొస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. బ్లాగ్ వేదిక టీం.
Thank You బ్లాగ్ వేదిక టీం ,
"Chowdary Ahmed"
gaaru ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి