ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ
సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ
కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయా
హరాయ .. శుభకరాయ .. నమశ్శివాయ
నమశ్శివాయా .. నమశ్శివాయా .. నమశ్శివాయా
నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో తాండవకేళీ లోలా
దయా కిరణముల ప్రసరించే
నీ చూపుల సుమధుర భావనలు
ఈ జగతికే చల్లని దీవెనలు
నమో నమో తాండవకేళీ లోలా
అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మధియించగా
అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మధియించగా
హాలాహలమే ప్రభవించి విషజ్వాలలే వెదజల్లగా
హాలాహలమే ప్రభవించి విషజ్వాలలే వెదజల్లగా
అభయమొసంగి గరళము మింగి
అభయమొసంగి గరళము మింగి
జగముల కాచిన జగదీశా పరమేశా
నమో నమో తాండవకేళీ లోలా
భువిని రధముగా రవిచంద్రులే చక్రాలుగా
నాల్గు వేదములే హయములుగా
బ్రహ్మదేవుడే సారధిగా
మేరుపర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రము కాగా
ప్రళయకాల భజ్యన్న గర్జనగ భీషణ శంఖము పూరించి
ప్రళయకాల భజ్యన్న గర్జనగ భీషణ శంఖము పూరించి
పాశుపతమ్మును సంధించి త్రిపురాసురులను వధియించి
పాశుపతమ్మును సంధించి త్రిపురాసురులను వధియించి
లోకాలను కాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా
లోకాలను కాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా
నమో నమో తాండవకేళీ లోలా
నమో నమో ఆశ్రిత జనపాలా
నమో నమో తాండవకేళీ లోలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి