Keblinger

Keblinger

9, జులై 2015, గురువారం

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయికధాసిరులు నొసగి సుఖశాంతులు కూర్చునుసిరులు నొసగి సుఖశాంతులు కూర్చును 
షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ 
సాయి ప్రేమసుధా 

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును 
షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ 
సాయి ప్రేమసుధా

పారాయణతో సకల జనులకి 
భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి 
భారాలను తొలగించే గాధ

సిరులు నొసగి సుఖశాంతులు 
కూర్చును షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ 
సాయి ప్రేమసుధా

షిరిడీ గ్రామంలో ఒక బాలుని రూపంలో
వేపచెట్టుక్రిందా వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు

పగలూరేయీ ధ్యానం పరమాత్మునిలో లీనం
పగలూరేయీ ధ్యానం పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టునీడయే గురుపీఠం

ఎండకు వానకు కృంగకు 
ఈ చెట్టు క్రిందనే ఉండకూ
సాయీ ... సాయీరా మశీదుకు 
అని మహల్సాపతి పిలుపుకు

మసీదుకు మారెను సాయి 
అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయీ భాయీ 
బాబా భోధల నిలయమనోయి

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును 
షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ 
సాయి ప్రేమసుధా

ఖురాను బైబిలు గీత ఒకటనె  
కులమత భేదము వద్దనే
గాలి వాననొక క్షణమున ఆపే 
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసి 
నీటి దీపములను వెలిగించే

పచ్చికుండలో నీటిని తెచ్చి 
పూలమొక్కలకు పోసి
నిండీ వనమును పెంచి మధ్యలో 
అఖండ జ్యోతిని వెలిగించే

కప్పకు పాముకు స్నేహం కలిపే 
బల్లి భాషకు అర్ధం తెలిపే

ఆర్తుల రోగాలను హరియించే 
భక్తుల బాధలు తాను భరించే
ప్రేమా సహనం రెండు వైపుల 
ఉన్ననాడే గురుదక్షిణ అడిగే

మరణం జీవికి మార్పును తెలిపి 
మరణించి తను మరలా బ్రతికే

సాయిరాం సాయిరాం సాయిరాం 
సాయిరాం సాయిరాం సాయిరాం

నీదని నాదని అనుకోవద్దనే 
ధునిలో ఊది విభూదిగనిచ్చే
భక్తి వెల్లువలు జయజయ ఘోషలు 
కావడి ఉత్సవమై సాగగా
కక్కడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా

సకలదేవతా స్వరూపుడై 
వేదశాస్త్రముల కతీతుడై 

సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై
భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి
తృటిలోన పగులగా

పరిపూర్ణుడై గురుపౌర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై 
శరీర శేవాలంగన చేసి దేహము విడిచెను సాయీ 
సమాధి అయ్యెను సాయి

సాయిరాం సాయిరాం సాయిరాం 
సాయిరాం సాయిరాం సాయిరాం

అఖిలాండకోటి బ్రహ్మండ నాయక 
శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్‌

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)