Keblinger

Keblinger

10, జులై 2015, శుక్రవారం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గామహా కనకదుర్గా విజయ కనకదుర్గా
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

ఓంకార రావాల అలల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను కృత యుగములోన
ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను
పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను

విజయుడైన అర్జునుని పేరిట
విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియు జేజేలు పలుకగా
కనకదుర్గకైనది స్థిరనివాసము

మేలిమి బంగరు ముద్దపసుపు
కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ

అమ్మ మనసుపడి అడిగి ధరించిన
కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికీ ఇదియే ముక్తి దీపం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత

దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి
భవబందాలను బాపే బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి

లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనుల కందించే
దివ్య రూపిణి మహాలక్ష్మి

విద్యా కవన గాన మొసగు వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గ
శత్రు వినాసిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్ధిని
విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి

భక్తులందరికి కన్నుల పండుగ
అమ్మా నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం

మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత


9, జులై 2015, గురువారం

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయికధాసిరులు నొసగి సుఖశాంతులు కూర్చునుసిరులు నొసగి సుఖశాంతులు కూర్చును 
షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ 
సాయి ప్రేమసుధా 

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును 
షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ 
సాయి ప్రేమసుధా

పారాయణతో సకల జనులకి 
భారాలను తొలగించే గాధ
పారాయణతో సకల జనులకి 
భారాలను తొలగించే గాధ

సిరులు నొసగి సుఖశాంతులు 
కూర్చును షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ 
సాయి ప్రేమసుధా

షిరిడీ గ్రామంలో ఒక బాలుని రూపంలో
వేపచెట్టుక్రిందా వేదాంతిగా కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు

పగలూరేయీ ధ్యానం పరమాత్మునిలో లీనం
పగలూరేయీ ధ్యానం పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం చేదు చెట్టునీడయే గురుపీఠం

ఎండకు వానకు కృంగకు 
ఈ చెట్టు క్రిందనే ఉండకూ
సాయీ ... సాయీరా మశీదుకు 
అని మహల్సాపతి పిలుపుకు

మసీదుకు మారెను సాయి 
అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయీ భాయీ 
బాబా భోధల నిలయమనోయి

సిరులు నొసగి సుఖశాంతులు కూర్చును 
షిరిడీ సాయికధా
మధుర మధుర మహిమాన్విత భోధ 
సాయి ప్రేమసుధా

ఖురాను బైబిలు గీత ఒకటనె  
కులమత భేదము వద్దనే
గాలి వాననొక క్షణమున ఆపే 
ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులను చేసి 
నీటి దీపములను వెలిగించే

పచ్చికుండలో నీటిని తెచ్చి 
పూలమొక్కలకు పోసి
నిండీ వనమును పెంచి మధ్యలో 
అఖండ జ్యోతిని వెలిగించే

కప్పకు పాముకు స్నేహం కలిపే 
బల్లి భాషకు అర్ధం తెలిపే

ఆర్తుల రోగాలను హరియించే 
భక్తుల బాధలు తాను భరించే
ప్రేమా సహనం రెండు వైపుల 
ఉన్ననాడే గురుదక్షిణ అడిగే

మరణం జీవికి మార్పును తెలిపి 
మరణించి తను మరలా బ్రతికే

సాయిరాం సాయిరాం సాయిరాం 
సాయిరాం సాయిరాం సాయిరాం

నీదని నాదని అనుకోవద్దనే 
ధునిలో ఊది విభూదిగనిచ్చే
భక్తి వెల్లువలు జయజయ ఘోషలు 
కావడి ఉత్సవమై సాగగా
కక్కడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా

సకలదేవతా స్వరూపుడై 
వేదశాస్త్రముల కతీతుడై 

సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై
భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి
తృటిలోన పగులగా

పరిపూర్ణుడై గురుపౌర్ణిమై
భక్తుల మనసులో చిరంజీవియై 
శరీర శేవాలంగన చేసి దేహము విడిచెను సాయీ 
సమాధి అయ్యెను సాయి

సాయిరాం సాయిరాం సాయిరాం 
సాయిరాం సాయిరాం సాయిరాం

అఖిలాండకోటి బ్రహ్మండ నాయక 
శ్రీ సమర్ధ సద్గురు సాయినాధ మహరాజ్‌

8, జులై 2015, బుధవారం

శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచంశ్రీ వెంకటేశ్వర వజ్ర కవచంశ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం
మార్కండేయ ఉవాచ

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః

ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్


7, జులై 2015, మంగళవారం

శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిశ్రీ వెంకటేశ్వర ప్రపత్తి
ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షఃస్థలనిత్యవాస రసికాం తత్ క్షాంతిసంవర్ధినీమ్
పద్మాలంకృతపాణివల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్

శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్
స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

ఆనూపురార్పిత సుజాత సుగంధిపుష్ప
సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ
సౌమ్యౌ సదానుభవనేపి నవాను భావ్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

సద్యోవికాసి సముదిత్వర సాంద్రరాగ
సౌరభ్యనిర్భర సరోరుహ సామ్యవార్తామ్
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

రేఖామయధ్వజసుధాకలశాతపత్ర
వజ్రాంకుశాంబురుహ కల్పకశంఖచక్రైః
భవ్యై రలంకృతతలౌ పరతత్వ చిహ్నైః
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

తామ్రోదరద్యుతిపరాజితపద్మరాగౌ
బాహ్యైర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ
ఉద్యన్నఖాంశుభిరుదస్త శశాంక భాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

సప్రేమభీతికమలాకరపల్లవాభ్యాం
సంవాహనే పి సపదిక్లమమాదధానౌ
కాంతావవాఙ్ననసగోచరసౌకుమార్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

లక్ష్మీమహీతదనురూపనిజానుభావ
నీళాదిదివ్యమహిషీ కర పల్లవానామ్
ఆరుణ్యసంక్రమణతఃకిల సాంద్రరాగౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

నిత్యానమద్విధిశివాదికిరోటకోటి
ప్రత్యుప్తదీప్త నవరత్నమహః ప్రరోహైః
నీరాజనావిధిముదారముపాదధానౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ
యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయా ప్యుపాత్తౌ
భూయస్తథేతి తవ పాణితల ప్రదిష్టౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ
యౌ దర్షితౌ స్వచరణౌ శరణం వ్రజేతి
భూయోపి మహ్యమిహతౌ కరదర్షితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

మన్మూర్ధ్ని కాళియఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రిశిఖరే శిరసి శ్రుతీనామ్
చిత్తే ప్యనన్య మనసాం సమమాహితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

అమ్లానహృష్యదవనీతలకీర్ణపుష్పౌ
శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానౌ
ఆనందితాఖిలమనోనయనౌ తవైతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

ప్రాయః ప్రపన్న జనతాప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశోరమృతాయమానౌ
ప్రాప్తౌ పరస్పరతులామతులాంతరౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబు జేన
సంసారతారకదయార్ద్రదృగంచలేన
సౌమ్యోపయంతృమునినా మమ దర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయము పేయతయా స్ఫురంత్యా
నిత్యాశ్రితాయ నిరవద్యగుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ 6, జులై 2015, సోమవారం

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలాఅరుణాచల అక్షరమణ మాల
ఓం నమో భగవతే  శ్రీ రమణాయ
అరుణాచల అక్షరమణ మాల  

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


అరుణాచల మనుచు స్మరియించువారల అహము నిర్మూలింపు  అరుణాచలా
అళగు సుందరముల వలె చేరి నేను నీ వు౦దమభిన్నమై  అరుణాచలా
లోదూరి లాగి నీ లోగుహను చెరగా నమరించి తేమొకో  అరుణాచలా
ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు  అరుణాచలా
ఈ నింద తప్పు నిన్నేటికి దలపించితిక విడువారెవరరు  అరుణాచలా
కనిన జనని కన్న ఘనదయాదాయకా ఇదియా యనుగ్రహము  అరుణాచలా
నిన్నేమార్చి యరుగనీక యుల్లము పైని నురుదిగా నుండుమా అరుణాచలా
ఊరూరు తిరుగక యుల్లము నిను గని యణగ నీ ద్యుతి జూపుము  అరుణాచలా
నను చెరచి యిపుడు నను కలియక విడుటిది మగతన మొక్కొయా   అరుణాచలా
ఏటి కీ నిదుర నన్నితరులు లాగగ ఇది నీకు న్యాయమా  అరుణాచలా
పంచేంద్రియ ఖలులు మదిలోన దూరుచో మదిని నీవుందవో   అరుణాచలా
ఒకడవౌ నిను మాయ మొనరించి వచ్చువారెవరిది నీ జాలము   అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


ఓంకార వాక్యార్ధ యుత్తమ సమహీన నిన్నెవరెరుగువారు  అరుణాచలా
అవ్వబోలె నొసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారము   అరుణాచలా
కన్నుకు గన్నయి కన్నులేక కను నిను కనువారెవరుగనుము   అరుణాచలా
ఇనుము ఆయస్కాంతము వలె గవిసి నను విడువక కలసి నాతోనుండుము   అరుణాచలా
గిరి రూప మైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్నేలుం   అరుణాచలా
క్రింద మీదెటను చెన్నొందు కిరణమణి నా క్రిందు గతి మాపు   అరుణాచలా
కుట్ర యంతయు గోసి గుణముగ బాలించు గురు రూపమై వెలుగు  అరుణాచలా
కూచి వాల్గన్నుల కోతబడక కృప చేసి నన్ చేరి కావుం   అరుణాచలా
వంచకా వేడియున్ గొంచెమున్ గరగవే అభయ మంచేలుమా   అరుణాచలా
అడుగకిచ్చెడు నీదు నకళంక మగు కీర్తి హాని సేయక బ్రోవు   అరుణాచలా
హస్తలమలక నీదు సద్రసమున సుఖోన్మాద మొందగ నేలు   అరుణాచలా
వల నుంచి భక్తుల పరిమార్చు నిను గట్టుకొని యెట్లు జీవింతును   అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


కోపరహిత గుణ గురిగాగ నను గొను కొరయేమి చేసితి  అరుణాచలా
గౌతమ పూజిత కరుణా ఘన నగమా కడ గంట ఏలుమా అరుణాచలా
సకలము కబళించు కరకాంతియిన మనో జలజ మరల్పుమా అరుణాచలా
తిండిని నిన్జేరితిని తిన నా నేను శాంతమై పోవుదును  అరుణాచలా
మది చల్లపడ భద్రకర ముంచి యమృతనోర్ తెరు మనుగ్రహచంద్ర అరుణాచలా
వన్నెను చెరచి నిర్వాణ మొనర్చి కృపావన్నె నిడి బ్రోవుమరుణాచలా
సుఖ సముద్రము పొంగ వాక్ మనమ్ములడంగ నూరక నమరు మందరుణాచలా
వంచింతువేల నన్ శోధింపకిక నీదు జ్యోతి రూపము చూపుం  అరుణాచలా
పరవిద్య గరపి యీ భూమి మైకము వీడి రూపగు విద్య జూపు  అరుణాచలా
చేరకున్నను మేను నీరుగ గరగి కన్నీటేరయి నశింతు అరుణాచలా
ఛీ యని ద్రోసిన చేయు కర్మ తపన గాకేది మను మారం అరుణాచలా
చెప్పక చెపి నీవు మౌనత నుండని యూరక యుందువే అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


సోమరి నైతిని మిన్నని సుఖ నిద్ర కన్న వేరెది గతి అరుణాచలా
శౌర్యము జూపితి శమియించె నని మాయ చలియి౦ప కున్నావు అరుణాచలా
కుక్కకు న్నీచమే నేనే గురుతుగొని వెదకి నిన్జేరుదు అరుణాచలా
జ్ఞానము లేక నీ యాస దైన్యము బాప జ్ఞానము దెల్పి బ్రోవుమరుణాచలా
తేటి వలెను నీవు వికసింప లేదని యెదుట నిలుతువేల  అరుణాచలా
తత్వ మెరుగజాల నంతయై నిలుతువే యిదియేమి తత్వమో  అరుణాచలా
తా నేను తానను తత్వ మిద్దానిని తానుగా చూపింతు  అరుణాచలా
త్రిప్పి యహంతను నెప్పుడు లో ద్రుష్టి గన దెలియు ననునదే  అరుణాచలా
తీరముండని యెద వెదకియు నిన్ను నే తిరిగి పొందితి బ్రోవు మరుణాచలా
సత్య జ్ఞానము లేని యీ జన్మ ఫలమేమి యొప్పగ రావేల  అరుణాచలా
శుద్ధ వాంగ్మన యుతులం దోచు నీ నిజా హంత గల్పి నను బ్రోవు అరుణాచలా
దైవ మనుచు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణ నాశ మొనర్చితి  అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


వెదుకక గనిన సచ్చ్రీయనుగ్రహనిధి మది తెగుల్ తీర్చి బ్రోవు   అరుణాచలా
ధైర్యము పరుగిడు నీ నిజహమరయ నే నాశమైతి బ్రోవు   అరుణాచలా
తాకి కృపాకరము నను గలియకున్న నిజము నశింతు బ్రోవు  అరుణాచలా
దోషరహిత నీవు నాతో నైక్యమయి నిత్యానంద మయమోనర్పరుణాచలా
నగకు నెడముకాదు నిన్వెదకిన నన్ను గను కృపానగ వేసి   అరుణాచలా
నాన లేదె వెదుక నేనయి నీ వొంటి స్థాణువై నిలిచితివి  అరుణాచలా
నీ జ్వాల గాల్చినన్ నీరు సేసెడు మున్నె నీ కృప వర్షింపు అరుణాచలా
నీవు నే నణగ నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణి౦పు  అరుణాచలా
అణురూపు నిన్ను నే మిన్ను రూపుం చేర భావోర్ములెపుడాగు  అరుణాచలా
సూత్ర జ్ఞానము లేని పామరు నా మాయా జ్ఞానము కోసికావు  అరుణాచలా
మక్కి మక్కి కరగి నే నిన్ను శరణంద నగ్నుడవై నిల్చితి  అరుణాచలా
నేస్తముండని నాకు నీ యాశ చూపినన్ మోసగింపక బ్రోవు  అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


నవసి చెడు ఫలము నందేమి ఫల మేరి పక్వత లోగొను అరుణాచలా
నొవ్వగింపకను నిన్ను నొసగి నన్ గోనలేదె యంతకుడవు నాకు  అరుణాచలా
చూచి చింతించి మేనుం దాకించి పక్వము చేసి నీ వేలి బ్రోవుం   అరుణాచలా
మాయ విషము పట్టి తలకెక్కి చెడుమున్నె కరుణ పటోసగిబ్రోవుం   అరుణాచలా
కను కృపన్ మాయాంతముగా కృప గనవేమి గను నీ కెవరు చెప్పుటెవరు  అరుణాచలా
పిచ్చి వీడ నినుబోలె పిచ్చి చేసితె దయన్ పిచ్చిని మాన్పుము  అరుణాచలా
నిర్భీతి నిను జేరు నిర్భీతు నను జేర భీతి నీకేలకో అరుణాచలా
అల్ప జ్ఞాన మదేది సుజ్ఞాన మేదయా ఐక్య మంద కరుణింపు అరుణాచలా
(భూ) గంధమగు మది పూర్ణ గంధము గొన బూర్ణ గంధ మొసంగు అరుణాచలా
పేరు తలపగనే పట్టి లాగితివి నీ మహిమ కనుదురెవరు అరుణాచలా
పోగ భూతము పోని భూతమై పట్టినన్ భూతగ్రస్తుని చేసి తరుణాచలా
మృదులతన్ నే బ్రాపు లేక వాడగనీక పట్టు కొమ్మయి కావు అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


పొడిచే మయికపర్చి నా బోధ హరియించి నీ బోధ గనుపించితి  అరుణాచలా
పోకరాకలు లేని సమరంగ దివి జూపు మా కృపాపోరాటం  అరుణాచలా
భౌతిక మౌ మేని పట్టార్చి యెపుడు నీ మహిమ గన గరునిణింపు అరుణాచలా
మలమందు నీవియ్య మలమగుటయో కృపా మలమందువై వెలుగు అరుణాచలా
మానము గొని చేరువారి మానము బాపి నిరభిమానత వెలుగు అరుణాచలా
మించగా వేడెడు కించిజ్ఞుడను నను వంచింపకను బ్రోవుమరుణాచలా
నావికుడుండగ పెనుగాలి నలయు నావను గాక కాచి బ్రోవుం అరుణాచలా
ముడిమూలముల్ గాన మునుకొంటివి సరిగ ముగియ భారము లేదొ  అరుణాచలా
ముక్కిడి మును జూపు ముకురము గాక నన్ హెచ్చించి కౌగలింపు  అరుణాచలా
సత్యాహమున మనో మృదు పుష్ప శయ్యపై మేన్గలయ గరుణింపు  అరుణాచలా
మీదు మీదుగ మ్రొక్కు భక్తుల జేరి నీ వందితే మేలిమి అరుణాచలా
మై మై దణచి క్రుపాంజనమున నీ సత్య వశ మొనరించితి అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


మొగ్గ (బోడి) పరిపి నను బట్ట బయట నీవు నట్టాడు టేలొకో   అరుణాచలా
మోహము ద్రప్పి నీ మోహ మొనర్చి నా మోహము తీరదా   అరుణాచలా
మౌనియై రాయిగా నలరక యున్నచో మౌన మిది యగునో   అరుణాచలా
ఎవరు నా నోటిలో మన్నును గొట్టి నా బ్రతుకును హరించినది   అరుణాచలా
ఎవరు గనక నాడు మదిని మైకపరచి కొల్లగొనిన దెవరు  అరుణాచలా
రమణుడనుచు నంటి రోషము గొనకనన్ రమియింప చేయరమ్ము అరుణాచలా
రేయింబవలు లేని బట్ట బయట యింట రమియింపగా రమ్ము  అరుణాచలా
లక్ష్యముంచి యనుగ్రహాస్త్రము వైచి నన్ గబళించి తుసురుతో  అరుణాచలా
లాభమీ విహపర లాభ హీనుని చేరి లాభ మే మందితీవి   అరుణాచలా
రమ్మని యనలేదే వచ్చి నావంతివ్వ వెరకు నీ తలవిధి  అరుణాచలా
రమ్మని లోదూరి నీ జీవ మిడునాడే నా జీవమును బాసి తరుణాచలా
విడిచిన కష్టమౌ విడాక నిన్నుసురును విడువ ననుగ్రహింపు  అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


ఇల్లు విడువ లాగి లోనింటిలో జొచ్చి యొగి నీదు నిలు చూపితరుణాచలా
వెలిపుచ్చితి న్నీదు సేత కినియక నీ కృప వెలిబుచ్చి కావు   అరుణాచలా
వేదాంతమున వేరు లేక వెలింగెడు వేద పదము బ్రోవుం  అరుణాచలా
నింద నాశీస్సుగా గొని దయాపాత్రుగా చేసి విడక కావు  అరుణాచలా
నీట హిమముగా ప్రేమకారు నీలో నన్ ప్రేమగ కరగి బ్రోవు  అరుణాచలా
అరుణాద్రి యన నే కృపావల బడితి దప్పునె నీ కృపావల  అరుణాచలా
చింతింప కృపపడ సాలీడు వలె గట్టి చెరపెట్టి బక్షించితి   అరుణాచలా
ప్రేమతో నీ నామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవు  అరుణాచలా
ననుబోలు దీనుల నిం పొంద కాచుచు చిరజీవివై బ్రోవు  అరుణాచలా
ఎముకలరుగు దాసు మృదు వాక్కు విను చెవిన్ గొనుమ నా యల్పోక్తు లరుణాచలా
షమగల గిరి యల్ప వాక్కు సద్వాక్కుగ గొని కావు మరి యిష్ట మరుణాచలా
మాలను దయచేసి యరుణాచలరమణ నా మాల దాల్చి బ్రోవు  అరుణాచలా
మాలను దయచేసి యరుణాచలరమణ నా మాల దాల్చి బ్రోవు  అరుణాచలా

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా


5, జులై 2015, ఆదివారం

మహా గణపతిం మనసా స్మరామి


మహా గణపతిం మనసా స్మరామి మహా గణపతిం
మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి

వసిష్ఠ వామ దేవాది వందిత 
మహా గణపతిం

మహా దేవ సుతం
మహా దేవ సుతం గురు గుహ నుతం
మార కోటిం ప్రకాశం శాంతం

మహా కావ్య నాటకాది ప్రియం
 మహా కావ్య నాటకాది ప్రియం
మూషికవాహన మోదక ప్రియం

మహా గణపతిం మనసా స్మరామి
వసిష్ఠ వామ దేవాది వందిత 
మహా గణపతిం మనసా స్మరామి

మహా గణపతిం మనసా స్మరామి
మహా గణపతిం మనసా స్మరామి

4, జులై 2015, శనివారం

సప్తర్షి విరచిత శ్రీ వెంకటేశ్వర శరణాగతి స్తోత్రంశ్రీ వెంకటేశ్వర శరణాగతి స్తోత్రం
శేషాచలం సమాసాద్యం కశ్యపాద్యా మహర్షయః
వెంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా

కలి సంతారకం పుణ్యం స్త్రోత్ర మేతజ్ఞపేన్నరః
సప్తర్షీవాక్ప్రాసాదేనా విష్ణుస్తస్మై ప్రసీదతి

కశ్యప ఉవాచ

కాది హ్రీమంత విద్యాయాః ప్రాస్యైవ పరదేవతా
కలౌ శ్రీ వెంకటేశాఖ్యా తామహం శరణం భజే

అత్రి ఉవాచ

అకారాది క్షకారాంత వర్నైర్య: ప్రతిపాద్యతే
కలౌ శ్రీవెంకటేశాఖ్యా శ్శరణం మే ఉమాపతి:

భరద్వాజ ఉవాచ

భగవాన్ భార్గవీ కాంతో భక్తాభీప్సిత దాయకః 
భక్తస్య వెంకటేశాఖ్యో భారధ్వాజసమే గతిహి:

విశ్వామిత్ర ఉవాచ


విరాడ్విష్ణు ర్విధాతా చ విశ్వ విజ్ఞాన విగ్రహః
విశ్వామిత్రస్య శరణం వెంకటేశో విభుస్సదా

గౌతమ ఉవాచ

గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతి ర్విభు:
శరణం గౌతమస్యాస్తు వెంకటాద్రి శిరోమణి:

జమదాగ్ని ఉవాచ

జగత్కర్తా జగద్భర్తా జగర్ధర్తా జగన్మయ:
జమదగ్నే: ప్రపనస్య జీవేశో వెంకటేశ్వరః

వశిష్ఠ ఉవాచ

వస్తువిజ్ఞాన మాత్రంయన్నిర్విశేషం సుఖం చ సత్
తద్బ్రమ్హైవాహ మస్మీతీ వెంకటేశం భజే సదా

ఫలశృతి

సప్తర్షి విరచితం స్తోత్రం సర్వదా యః పఠెన్నరః
సో భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్రవిజయీభవేత్3, జులై 2015, శుక్రవారం

శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః
శ్రీ కంఠార్పిత పత్ర గండ యుగళాం సింహాసనా ధ్యాసినీం
లోకానుగ్రహ కారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం
పాకారిప్రముఖామరార్చితపదాం మత్తేభకుంభస్తనీం

శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌

వింధ్యాద్రీంద్రగృహాన్తరే నివసతీం వేదాన్తవేద్యాం నిధిం
మందారద్రుమపుష్పవాసితకుచాం మాయాం మహామాయినీః
బంధూక ప్రసవోజ్వలారుణనిభాం పంచాక్షరీరూపిణీం

శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌

మాద్యచ్ఛుంభనిశుంభమేఘపటల  ప్రధ్వంసజంఝానిలాం
కౌమారీ మహిషాఖ్యశుష్కవిటపీ  ధూమోరుదావానలాం
చక్రాద్యాయుధసంగ్రహోజ్జ్వలకరాం  చాముండికాధీశ్వరీం

శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌

దృక్కంజాత  విలాసకల్పిత సరోజా తోరుశోభాన్వితాం
నక్షత్రేశ్వరశేఖరప్రియతమాం  దేవీ జగన్మోహినీమ్‌
రంజన్మంగళదాయినీం శుభకరీం రాజత్స్వరూపోజ్జ్వలాం

శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌


కేళీమందిరరజతాచతలాం సంపూర్ణ చంద్రాననాం
యోగీంద్రైర్నుత పాదపంకజయుగాం రత్నాంబరాలంకృతాం
స్వర్గావాస సరోజ పత్ర నయనాబీష్టప్రదాం నిర్మలాం


శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌

సంసారార్ణవతారికాం భగవతీం  దారిద్ర్యవిధ్వంసినీం
సంధ్యాతాండవకేళికప్రియసతీం  సద్భక్తకామప్రదాం
శింజన్నూపురపాదపంకజయుగాం  బింబాధరాం శ్యామలాం

శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌

చంచత్కాంచనరత్నచారుకటకాం  సర్వంసహావల్లభాం
కాంచీకాంచనఘంటికాఘణఘణాం  కంజాతపత్రేఓనాం
సారోదారగుణాంచితాం పురహర  ప్రాణేశ్వరీం శాంభవీం

శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌

బ్రహ్మర్షీశ్వరవంద్య పాదకమలాం  పంకేరుహాక్షస్తుతాం
ప్రాలేయాచలవంశపావనకరీం  శృంగారభూషానిధిం
తత్త్వాతీతమహాప్రభాం విజయినీం  దాక్షాయణీం భైరవీం

శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌
శ్రీశైల భ్రమరాంబికాం భజ మనః శ్రీ శారదాసేవితామ్‌

భ్రమరాంబామహాదేవ్యా అష్టకం సర్వసిద్ధిదం
శత్రూనాం చ రిపణాం చ  ధ్వంసనం తద్వదా మ్యహమ్‌


1, జులై 2015, బుధవారం

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంశ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం
సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి:

నజానామి శబ్దం నజానామి చార్థం
నజానామి పద్యం నజానామి గద్యం
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్

మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహం
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం

యదా సన్నిధానం గతామానవామే
భవామ్భోధిపారం గతాస్తేతదైవ
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రం

యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః
తథైవాపదః సన్నిధౌ సేవతాంమే
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం

గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః
తదా పర్వతే రాజతే తేధిరూఢాః
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు

మహామ్భోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం

లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్

రణద్ధంసకే మంజులే త్యన్తశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే

సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్

పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ
స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్
నమస్యామ్యహం తారకారే! తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్

విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్
నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్

స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్
కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి

విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః

సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా
జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః

స్ఫురద్రత్న కేయూర హారాభిరామః
చల త్కుండల శ్రీలస ద్గండభాగః
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః

ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య
హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్

కుమారేశసూనో! గుహస్కందసేనా
పతే శక్తిపాణే మయూరాధిరూఢ
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్

కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్
దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు
మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం

ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా

సహస్రాండ భోక్తాత్వయా శూరనామా
హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి

అహం సర్వదా దుఃఖభారావసన్నో
భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్

అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే

దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః

మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం
అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే

కలత్రం సుతాబంధువర్గః పశుర్వా
నరోవాథ నారీ గృహేయే మదీయాః
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార

మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః
తథా వ్యాధయో బాధకా యే మదంగే
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే న కిం దేవసేనాధినాథ
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు

జయానందభూమన్ జయాపారధామన్
జయామోఘకీర్తే జయానందమూర్తే
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో

భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరఃసః

ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచిత
శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సంపూర్ణమ్Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)