Keblinger

Keblinger

30, అక్టోబర్ 2014, గురువారం

శివోహం శివోహం - ( New Age Version )





నిత్యానంద స్వరూపా 
శివోహం శివోహం శివోహం శివోహం




27, అక్టోబర్ 2014, సోమవారం

కానరారా కైలాస నివాసా



కానరారా కైలాస నివాసా




కానరారా కైలాస నివాసా 
బాలేందుధరా జటాధరా హరా
కానరారా కైలాస నివాసా 
బాలేందుధరా జటాధరా .. కానరారా 

భక్తజాల పరిపాల దయాళా
భక్తజాల పరిపాల దయాళా 
హిమశైల సుతా ప్రేమ లోలా 

కానరారా కైలాస నివాసా 
బాలేందుధరా జటాధరా .. కానరారా 

నిన్నుచూడ మది కోరితిరా .. 
నిన్నుచూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా

నిన్నుచూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా 
సన్నగ సేయక కన్నులు చల్లగా 
మన్నన సేయర గిరిజా రమణా 

కానరారా కైలాస నివాసా 
బాలేందుధరా జటాధరా .. కానరారా

సర్పభూషితాంగా కందర్ప దర్ప భంగా
సర్పభూషితాంగా కందర్ప దర్ప భంగా 
భావాపాశ నాశ పార్వతీ మనోహరా హే మహేశ
వ్యోమకేశ త్రిపుర హర 

కానరారా కైలాస నివాసా 
బాలేందుధరా జటాధరా .. కానరారా


23, అక్టోబర్ 2014, గురువారం

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం


దీపావళి శుభాకాంక్షలు


 లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం



 లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం 
శ్రీరంగ ధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం 
లోకైక దీపాంకురామ్
 
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ 
బ్రహ్మేంద్ర గంగాధరామ్
త్వాం త్రైలోక్యకుటుబినీం సరసిజాం 
వందే ముకుందప్రియామ్



17, అక్టోబర్ 2014, శుక్రవారం

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి



అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి



అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం

శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి
ఆనంద రూపిణి పాలయమాం
ఆనంద రూపిణి పాలయమాం 

అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం
 శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి
ఆనంద రూపిణి పాలయమాం 

ఆనంద రూపిణి పాలయమాం
ఆనంద రూపిణి పాలయమాం
ఆనంద రూపిణి పాలయమాం  

 

16, అక్టోబర్ 2014, గురువారం

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం





ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి



ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయీ 
షిరిడి సాయీ
షిరిడి సాయీ

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకలపాప హరణం

సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య చరణం భాగీరధీ సమానం
సాయి దివ్య నామం భవతారక మంత్రం
శరణు శరణు శరణం గురుసాయి శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

యోగి ఓలే భిక్షాటన చేసి
మా పాపాలకు జోలిపట్టే భిక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
నీటితోనే జ్యోతులు వెలిగించి
తెరిపించెనులే జ్ఞాన చక్షువు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ

రగిలే ధునిలో చేతులు ఉంచి
పసిపాపను ఆదుకున్న ఆత్మబంధువూ
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకలా పాప హరణం

సేవించిన రోగుల దీవించి
వైద్యో నారాయణో హరి అని నిలిచాడు
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించినాడు

శరణు శరణు శరణం గురు సాయినాధ శరణం
సాయి కథా శ్రవణం సకలా పాప హరణం
తిరగలి విసిరి వ్యాధిని కసిరి
ఆపదనే తప్పించిన దీనబంధువు

శరణు శరణు శరణం గురుసాయి శరణం
సాయి కథా శ్రవణం సకల పాప హరణం

ఎక్కడయ్యా సాయి ఎడనున్నావోయీ
నడవలేకున్నాను ఎదురుపడవోయీ
నిను చూడందే నా మనసు కుదుటపడదాయె

ఎప్పుడు చూసినా ఆత్మధ్యానమే కానీ
నీ ఆకలే నీకు పట్టదా..
ఏ జన్మ బంధమో మనది ఏనాటి రుణమో ఇది
పట్టవయ్యా సాయి..

ప్రతిరూపం తన ప్రతిరూపమని
యుగాలకే మోక్షమిచ్చే మౌని
పెను తుపాలే విరుచుకుపడగా
బీతిల్లిన జనులే పరుగులీడగా
ఆగిపోమ్మని ఆజ్ఞపించినా
గోవర్థన గిరిధారి షిరిడి పుర విహారీ

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయీ



11, అక్టోబర్ 2014, శనివారం

గణేశ పంచరత్న స్తోత్రము .. ముదాకరాత్తమోదకం



వక్రతుండ సంకష్టి చతుర్ధి 



 

ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకం
ముదాకరాత్తమోదకం సదావిముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకం

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం

అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం

నమామి తం వినాయకం

నతేరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరం
 నతేరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరం

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం
పరాత్పరం నిరంతరం

సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం

సమస్తలోక శంకరం నిరస్త దైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్ర మక్షరం

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం
నమస్కరోమి భాస్వరం

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం
అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వచర్వణం

ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం
కపోలదానవారణం భజే పురాణ వారణం
భజే పురాణ వారణం

నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం
నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూప మంతహీనమంతరాయ కృంతనం

హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం


ఫలశ్రుతి:

మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశరమ్
అరోగతాం అదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్
 

ఇతి శ్రీ శంకరాచార్య విరచితం 
గణేశ పంచరత్నం సంపూర్ణం.

9, అక్టోబర్ 2014, గురువారం

నమో ఆంజనేయం నమో దివ్య కాయం - ఆంజనేయ స్తుతి



 శ్రీ ఆంజనేయం నమస్తే 
ప్రసన్నాంజనేయం నమస్తే



నమో  ఆంజనేయం నమో దివ్య కాయం 
నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం 
నమో మిధిల రక్షాకరం రుద్ర రూపం 
నమో మారుతిం రామ దూతం నమామి 

నమో వాల  వేశం నమో దివ్య భాసం 
నమో వజ్ర దేహం నమో బ్రహ్మ తేజం 
నమో శక్తి సంహారకం వజ్ర కాయం 
నమో మారుతిం రామ దూతం నమామి

శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే

నమో వానరేంద్రం నమో విశ్వపాలం 
నమో విశ్వమోదం నమో దేవ శూరం 
నమో గగన సంచారితం పవన తనయం 
నమో మారుతిం రామ దూతం నమామి

నమో రామదాసం నమో భక్త పాలం 
నమో ఈశ్వరాంశం నమో లోకవీరం
నమో భక్త చింతామణీం గదాపాణీం
నమో మారుతిం రామ దూతం నమామి

శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
 
 నమో పాపనాశం నమో సుప్రకాశం 
నమో వేదసారం నమో నిర్వికారం 
నమో నిఖిల సంపూజితం దేవ శ్రేష్టం
నమో మారుతిం రామ దూతం నమామి

నమో కామ రూపం నమో రౌద్ర రూపం 
నమో వాయుతనయం నమో వానరాగ్రం 
నమో భక్త వరదాయకం ఆత్మవాసం 
 నమో మారుతిం రామ దూతం నమామి

 శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే

నమో రమ్యనామం నమో భవపునీతమ్ 
నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం
నమో శత్రునాశనకరం ధీర రూపం 
నమో మారుతిం రామ దూతం నమామి

నమో దేవదేవం నమో భక్త రత్నం 
నమో అభయవరదం నమో పంచవదనం
నమో శుభద శుభ మంగళం ఆంజనేయం 
నమో మారుతిం రామ దూతం నమామి

 శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే
శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే

 

8, అక్టోబర్ 2014, బుధవారం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం - ఆంజనేయ దండకం


  శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం


 

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం

భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్
నీ నామ సంకీర్తనల్ చేసి
నీ రూపు వర్ణించి,
నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి
నీ మూర్తినిన్ గాంచి, 

నీ సుందరం బెంచి
నీ దాస దాసుండనై, 

రామ భక్తుండనై ,నిన్ను నే గొల్చెదన్
 

నను కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ చేసితే
నా మొరాలించితే, నన్ను రక్షించితే

అంజనాదేవిగర్భాన్వయా ! దేవ! 
 నిన్నెంచ నేనెంత వాడన్
 దయాశాలివై చూచితే,
దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే..
 

తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై
స్వామి కార్యంబు నందుండి
శ్రీరామ సౌమిత్రులం జూచి, 

వారిన్ విచారించి,
సర్వేశు పూజించి,
యబ్బానుజున్ బంటు గావించి,
యవ్వాలినిన్ జంపి,
కాకుస్థతిలకున్ దయా ద్రుష్టి వీక్షించి,
కిష్కిందకేతెంచి ...
 

శ్రీరామ కార్యార్థివై లంకకేతెంచియున్
లంకిణింజంపియున్, 

లంకనున్ గాల్చియున్
భూమిజన్ జూచి ఆనందముప్పొంగ
యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి,
శ్రీరాముకున్నిచ్చి సంతోషనున్ జేసి
సుగ్రీవునుం, అంగదున్, జాంబవంతాది 
నీలాదులున్ గూడి
యాసేతువున్ దాటి 
వానరా  మూకలై పెన్మూకలై, 
దైత్యులన్ ద్రుంచగా .. 

రావణుడంత కాలాగ్ని రూపూగ్రుడై,  
కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి,
యాలక్ష్మణున్ మూర్ఛనొందింపగ,
అప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,
సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా .. 


కుంభకర్ణాది వీరాదితో పోరి, 
 శ్రీరామబాణాగ్ని వారందరిన్,
 రావణున్ జంపగా
నంత లోకంబులానందమైయుండ,

 నవ్వేళనన్ నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి,
 పట్టాభిషేకంబు చేయించి ..
 

సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముతో చేర్చి,
అయోద్యకున్ వచ్చి 

పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్
రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను ,
నీనామసంకీర్తనల్ చేసితే,
పాపముల్ బాయునే, 

భయములున్ దీరునే,
భాగ్యముల్ గల్గునే, 

సకలసామ్రాజ్యముల్, 
సకలసంపత్తులున్ గల్గునే,
వానరాకార! యోభక్తమందార! 
యోపుణ్యసంచార! యోధీర! యోశూర!
 నీవే సమస్తంబు, నీవే ఫలంబుగా వెలసి
యాతారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్
స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చ,

శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై 
యెప్పుడున్ తప్పకన్ తలచు
నాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు, 
త్రైలోక్యసంచారివై,
రామ నామాంకితధ్యానివై, బ్రహ్మవై
తేజంబునన్ రౌద్రిణీ జ్వాల 
కల్లోల హావీర హనుమంత
ఓంకారహ్రీంకార శబ్దంబులన్, 
భూతప్రేతపిశాచంబులన్
గాలి దయ్యంబులన్, 

నీదు వాలంబునన్ జుట్టి,నేలంబడంగొట్టి,
నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్
రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై

బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూపి
రార నాముద్దు కుమారా యంచున్
దయాద్రుష్టివీక్షించి నన్నేలు నాస్వామీ!

నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే!
నమస్తే వ్రత పూర్ణ హారీ  
నమస్తే వాయుపుత్రా నమస్తే!
నమస్తే
నమస్తే
నమస్తే నమస్తే నమస్తే నమః


5, అక్టోబర్ 2014, ఆదివారం

కలిగెనిదే నాకు కైవల్యము




కలిగెనిదే నాకు కైవల్యము



కలిగెనిదే నాకు కైవల్యము
కలిగెనిదే నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది

కలిగెనిదే  నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది

జయపురుషోత్తమ జయ పీతాంబర
జయజయ కరుణాజలనిధీ
దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా
క్రియ యిది నీ దివ్యకీర్తనమే

కలిగెనిదే  నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది
కలిగెనిదే  నాకు కైవల్యము

శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్ధన
పరమ మెఱంగను భక్తి యెఱంగను
నిరతము నాగతి నీదాస్యమే

కలిగెనిదే  నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది
కలిగెనిదే  నాకు కైవల్యము

నమో నారాయణా నమో లక్ష్మీపతి
నమః  పుండరీక నయనా
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీ కైంకర్యమే

కలిగెనిదే  నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది
కలిగెనిదే  నాకు కైవల్యము

గోవిందా హరి గోవిందా ..  గోవిందా భజ గోవిందా
గోవిందా హరి గోవిందా .. గోవిందా భజ గోవిందా 


4, అక్టోబర్ 2014, శనివారం

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు



కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు


కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు


  కుమ్మరదాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల నిచ్చిన వాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్రవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు 


కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
 

  కంచిలోననుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించినవాడు
యెంచి ఎప్పుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ పాలించినవాడు 

 కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు


3, అక్టోబర్ 2014, శుక్రవారం

నారాయణ నారాయణ జయ గోవింద హరే



నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే




 నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణా
నవ నీరద సంకాశ కృత కలి కల్మష నాశ నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

యమునా తీర విహార ధృతకౌస్తుభ మణి హార నారాయణా
పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

మంజుల గుంజాభూష మాయా మానుష వేష నారాయణా
రాధధరమధురసిక రజనీకర కులతిలక నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

మురళీగాన వినోద వేదస్తుత భూపాద నారాయణా
వారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీరమణ నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

జలరుహదలనిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణా
పాతకరజనీ సంహార కరుణాలయ మాముద్ధర నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

అఘబకక్షయ కంసారే కేశవ కృష్ణ మురారే నారాయణా
హాటక నిభ పీతాంబర అభయం కురుమే మావార నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

దశరథ రాజకుమార దానవ మద సంహార నారాయణా
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

సరయూ తీర విహార సజ్జన రుషిమందార నారాయణా
విశ్వామిత్ర ముఖత్ర వివిధ పరాసుచరిత్ర నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణా
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

దశరథ వాగ్ధ్రుతి భార దండకవన సంచార నారాయణా
ముష్టిక చాణూర సంహార ముని మానస విహార నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

వాలీ నిగ్రహశౌర్య వరసుగ్రీవహితాచార్య నారాయణా
శ్రీ మురళీ కర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

జలనిధి బంధన ధీర రావణ కంట విదార నారాయణా
తాటకమర్దనరామ నటగుణ వివిధ ధనాడ్య నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణా
సంభ్రమసీతాకార సాకేతపురవిహార నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. గోవింద హరే
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. గోపాల హరే

అచలోద్ధ్రుతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణా
నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణా

నారాయణ నారాయణ
జయ గోవింద హరే .. నారాయణా
నారాయణ నారాయణ
జయ గోపాల హరే .. నారాయణా 

నారాయణా   .. నారాయణా  .. నారాయణా 
 
శ్రీమత్ శంకరాచార్య విరచిత 
నారాయణ స్తోత్రం సంపూర్ణం


శ్రీ మాతా రాజరాజేశ్వరి


ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్రఘండేతి కూష్మాండేతి చతుర్దశీ
పంచమస్కంధమాతేతీ, షష్ట్యా కాత్యాయనేతి చ
సప్తమా కాలరాత్రిశ్చ, అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చేతి, నవదుర్గాఃప్రకీర్తితాః



ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు  ఈ నవరాత్రులను దసరా అంటారు. శరత్కాలములో వచ్చే ఈ శరన్నవ రాత్రులలోనే  అమ్మవారిని వివిధ అలంకారాలతో అలంకరించి, శరణు కోరుతూ పూజించి, నైవేద్యాలు సమర్పిస్తుంటాము.  చెడు మీద విజయం సాధించటానికి ఆదిపరాశక్తి తన అంశలతో విభిన్న రూపాలలో అవతరించింది .. . అవి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సర్వసిద్ధిధాత్రి అనే నవ రూపాలు. వీటినే నవదుర్గలుగా కొలుస్తాం.  

 ఈ పండుగను పదిరోజులు చేసినా రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు రాజేశ్వరి అవతారంలో రాక్షససంహారం చేసింది. మాతా రాజ రాజేశ్వరి ఎంతో ప్రశాంతతతో, చిరునవ్వుతో  సకల విజయాలు ప్రసాదిస్తుంది. 

నైవేద్యంగా చిత్రాన్నం ( పులిహోర ), లడ్డూలు, అరటిపళ్ళు సమర్పించి,
"ఓం శ్రీ మాత్రే నమః" అనే మంత్రం జపించి అమ్మవారిని పూజించాలి .. 
విజయదశమి  రోజు ప్రారంభించే ఏ  పనైనా అమ్మదయవల్ల దిగ్విజయంగా పూర్తవుతుందని భక్తుల నమ్మకం . ఈ నవరాత్రులలో సాయత్రం ఆరు తర్వాత చేసే అమ్మవారి పూజ విశేష ఫలితాలను ఇస్తుందని చెప్తారు . 


 __/\__  ఓం శ్రీ మాత్రే నమః __/\__ 


నవమి - జై సిద్ధిధాత్రీ జగదంబా


మార్కండేయ పురాణంలో అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఈశిత్వ, వశిత్వ, సర్వకామావసాయిత, సర్వజ్ఞత, దూరశ్రవణ, పరకాయ ప్రవేశ, వాక్సిద్ధి, కల్పవృక్షత్వ, సృష్టిసంహరీకరణ, అమరత్వం, సర్వనాయకత్వం, భావసిద్ధి అని అష్టసిద్ధులు చెప్పబడ్డాయి.

ఈ తల్లి పరమశివుడితో కలసి అర్థనారీశ్వరుడిగా  అవతరించింది. చతుర్భుజి. సింహవాహనాన్ని అధిరోహించింది. కమలవాసిని. కుడిచేతుల్లో గదను, చక్రాన్ని, ఎడమచేతుల్లో శంఖాన్ని, కమలాన్ని ధరించింది. ఈ మాతను ఉపాసించిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి .. నైవేద్యంగా పాయసాన్నం సమర్పించాలి.

సిద్ధ గంథర్వయక్షాద్వైః అసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్‌ సిద్ధిదా సిద్ధిదాయినీ
జై  సిద్ధిధాత్రీ జగదంబా



2, అక్టోబర్ 2014, గురువారం

గోవింద గోవింద యని కొలువరే ..




గోవింద  గోవింద యని కొలువరే




గోవింద  గోవింద యని కొలువరే
గోవిందా యని కొలువరె
గోవింద  గోవింద యని కొలువరే
గోవిందా యని కొలువరె

హరియచ్యుతా యని పాడరే
పురుషోత్తమా యని పొగడరే
పరమపురుషా యని పలుకరే
సిరివర యనుచును జెలగరె జనులు

గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
గోవింద  గోవింద యని కొలువరే ..

పాండవవరద యని పాడరే
అండజవాహను గొనియాడరే
కొండలరాయనినె కోరరె
దండితో మాధవునినె తలచరె జనులు

గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
గోవింద  గోవింద యని కొలువరే ..

దేవుడు శ్రీవిభుడని తెలియరె
సోవల అనంతుని జూడరె
శ్రీవేంకటనాధుని జేరరె
పావనమై యెప్పుడును బదుకరె జనులు

గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
గోవింద  గోవింద యని కొలువరే .. 

గోవింద  గోవింద యని కొలువరే
గోవిందా యని కొలువరె
గోవింద  గోవింద యని కొలువరే
గోవిందా యని కొలువరె

గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
 గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా
గోవిందా  గోవిందా  గోవిందా  గోవిందా

అష్టమి - జై మహాగౌరీ జగదంబా



ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు తెల్లని కాంతులతో మెరుస్తుంటాయి. ఈమె వృషభ వాహనంపై ఉంటుంది. చతుర్భుజి. కుడిచేతుల్లో అభయముద్రను,  త్రిశూలాన్ని ధరిస్తుంది. ఎడమచేతుల్లో  ఢమరుకాన్ని, వరముద్రనూ కలిగిఉంటుంది. శివుడిని పరిణయమాడాలని కఠోరంగా తపస్సు చేసినందువల్ల ఈమె శరీరం నల్లగా అయిపోయింది.శివుడు ప్రసన్నుడై అమ్మ శరీరాన్ని గంగాజలంతో పరిశుద్దంచేశాడు. ఆ కారణంగా మాత శ్వేతవర్ణశోభిత అయింది. మహాగౌరిగా విలసిల్లింది. 

ఈ మాతను ఉపాసిస్తే కల్మషాలన్నీ పోతాయి. సంచితపాపం నశిస్తుంది. భవిష్యత్తులో పాపాలు, ధైన్యాలు దరిచేరవు. ఈ తల్లిని ధ్యానించి, స్మరించి, పూజించి ఆరాధించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయి. నైవేద్యంగా చక్కెర పొంగలి (గుడాన్నం) సమర్పించాలి.

 శ్వేతేవృషే సమారూఢా శ్వేతాంబరధరాశుచిః
మహాగౌరిశుభం దద్వాత్‌ మహాదేవ ప్రమోధరా

జై మహాగౌరీ జగదంబా


1, అక్టోబర్ 2014, బుధవారం

వేదం బెవ్వని వెదకెడినీ.. ఆ దేవుని గొనియాడుడీ



వేదం బెవ్వని వెదకెడినీ..   


వేదం బెవ్వని వెదకెడినీ..  
ఆ దేవుని గొనియాడుడీ
వేదం బెవ్వని వెదకెడినీ..
ఆ దేవుని గొనియాడుడీ

వేంకట రమణా గోవిందా
సంకట హరణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకట రమణా గోవిందా

అలరిన చైతన్యాత్మకుడెవ్వడు
కలడెవ్వడెచట గలడనిన
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు
కలడెవ్వడెచట గలడనిన

తలతు రెవ్వనిని దను వియోగదశ
యిల నాతని భజియించుడీ
తలతు రెవ్వనిని దను వియోగదశ
యిల నాతని భజియించుడీ

వేదం బెవ్వని వెదకెడినీ..
ఆ దేవుని గొనియాడుడీ

వేంకట రమణా గోవిందా
సంకట హరణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకట రమణా గోవిందా

కడగి సకలరక్షకు డిందెవ్వడు
వడి నింతయు నెవ్వనిమయము
కడగి సకలరక్షకు డిందెవ్వడు
వడి నింతయు నెవ్వనిమయము

పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని
దడవిన ఘనుడాతని గనుడీ
పిడికిట తృప్తులు పితరు లెవ్వనిని
దడవిన ఘనుడాతని గనుడీ

వేదం బెవ్వని వెదకెడినీ..
ఆ దేవుని గొనియాడుడీ

వేంకట రమణా గోవిందా
సంకట హరణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకట రమణా గోవిందా

కదసి సకలలోకంబుల వారలు
యిదివో కొలిచెద రెవ్వనిని
కదసి సకలలోకంబుల వారలు
యిదివో కొలిచెద రెవ్వనిని

త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుడీ
త్రిదశవంద్యుడగు తిరువేంకటపతి
వెదకి వెదకి సేవించుడీ

వేదం బెవ్వని వెదకెడినీ..
ఆ దేవుని గొనియాడుడీ

వేంకట రమణా గోవిందా
సంకట హరణా గోవిందా
గోవిందా హరి గోవిందా
వేంకట రమణా గోవిందా

వేంకట రమణా గోవిందా
 వేంకట రమణా గోవిందా
 వేంకట రమణా గోవిందా

సప్తమి -జై కాళరాత్రీ జగదంబా


నవరాత్రులలో  స్వరూపం కాళరాత్రి ఈ తల్లి శరీర వర్ణం గాఢాంధకారంవలె నల్లనిది. తలపై కేశాలు విరబోసుకొని, మెడలో హారం విద్యుత్‌కాంతితో వెలుగుతుంది. ఈమె నాసిక నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడుతుంటాయి. ఈమె వాహనం గాడిద. కుడిచేతిలో అభయముద్ర, వరముద్ర కలిగి ఉంటుంది. ఎడమచేతిలో ముళ్ళ ఇనుప ఆయుధం, ఖడ్గం ధరిస్తుంది. చూడటానికి భయంకరంగా ఉన్నప్పటికీ భక్తులపాలిటి కల్పతరువు.

అమ్మను పూజించిన వారికి సమస్త పాపాలు, విఘ్నాలు తొలగుతాయి. గ్రహబాధలు ఉండవు. అగ్ని, జల, జంతు, శత్రు, రాత్రి భయాలు ఉండవు. నైవేద్యంగా కూరగాయలతో అన్నాన్ని సమర్పించాలి. 

ఏకవేణీ జపాకర్ణ పూరా నగ్నఖరాస్థితా
లంబోష్టి కర్ణికాకర్ణ తైలాభ్యక్త శరీరిణి
వామపాదోల్ల సల్లోహ లతాకంటకభూషణా
వరమూర్థధ్వజాకృష్టా కాళరాత్రీర్భయంకరీ 

జై కాళరాత్రీ జగదంబా



Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)