Keblinger

Keblinger
శ్రీ మంజునాధ (2001) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ మంజునాధ (2001) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, సెప్టెంబర్ 2015, సోమవారం

ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే



ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే



ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

శక్తి కి ద్రక్తి కి ఒక్కడే
భక్తి కి ముక్తి కి ఒక్కడే దిక్కొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

నువ్వు రాయి వన్నాను లేనేలేవన్నాను
మంజునాధ మంజునాధ
పరికించె మనసు ఉంటే  నీలోనె ఉన్నానన్నావు

లోకాలు దొరకాదు  దొంగవని చాటాను
మంజునాధ మంజునాధ
నా పాప రాశులన్ని దొంగల్లె దోచుకు పోయావు

శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధరా
జయ జయ శంభో జయ జయ చంద్రధరా

నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాధ మంజునాధ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు

నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాధ మంజునాధ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు

దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే అవునొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధరా
జయ జయ శంభో జయ జయ చంద్రధరా

శంకరా మురహరా శంభో హర హరా
మంజునాధ మంజునాధ మంజునాధ మంజునాధ 

 

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

ఓం అక్షరాయ నమః ఆద్యంత రహితాయ నమః



ఓం అక్షరాయ నమః



ఓం అక్షరాయ నమః ఆద్యంత రహితాయ నమః
దీవరదళశ్యామాయ నమః ఈశ్వరాయ నమః
ఉపకార ప్రియాయ నమః ఊర్ధ్వలింగాయ నమః

రుగ్య యజుస్సామ సంభూతాయ నమః
ౠకార మాతృకా వర్ణ రూపాయ నమః
ఋగ్వతాయ నమః ఓం అక్షరాయ నమః

యూనితాఖిల దైత్యాయ నమః
యేజితాఖిల సంశ్రయాయ నమః
ఐహితామూష్మికా వరదాయ నమః
ఓజస్సుతే నమః

ఔదార్య నిధయే నమః అంబికా పతయే నమః
కపగ్ధినే నమః ఖట్వాంగినే నమః
గణనాథాయ నమః ఓం అక్షరాయ నమః

ఘనానందాయ నమః యశ్శేవితాయ నమః
చంద్రశేఖరాయ నమః చందోవ్యాకరణసారాయ నమః
జనప్రియాయ నమః జంఝానిల మహావేదాయ నమః

న్యంబంజితాయ నమః పంకార నృత్య విభవాయ నమః
థం శబ్దప్రియాయ నమః ఓం అక్షరాయ నమః

ఢం ఢం ఢం ఢం ఢంబాయ నమః
ఢక్కా నినాద ముదితాయ నమః
గా రి స ని దా ప మ గణథ్రంజితాయ నమః
తత్వమసి తత్వాయ నమః థస్వరూపాయ నమః

దక్షిణామూర్తయే నమః ధరణీధరాయ నమః
ధర్మస్థల నివాసాయ నమః
నందీ ప్రియాయ నమః ఓం అక్షరాయ నమః

పరాత్పరాయ నమః ఫణిభూషణాయ నమః
బహుభూరితాయ నమః భవ్యాయ నమః
మహమంజునాథాయ నమః
యజ్ఞ యజ్ఞాయ నమః రక్ష రక్షాకరాయ నమః

మ గ రి గ మ ప ద ని స రి లక్ష్యాయ నమః
దరేణ్యాయ నమః శబ్దబ్రహ్మణ్యే నమః 
షఢాధారాయ నమః

స రి గ మ ప ద ని స ని ద ప మ గ రి స
సప్తస్వరాయ నమః ధరాయ నమః
క్షమాపరాపరాయణాయ నమః నమః నమః


3, సెప్టెంబర్ 2015, గురువారం

ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం



ఈ పాదం పుణ్య పాదం



ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం
ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం దివ్య పాదం
ప్రణవమూలనాదం  ప్రథమలోకపాదం
ప్రణతులే చేయలేని ఈ కరమేల ఈ శిరమేల

ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధర్మపాదం

మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ ఆ ....
మార్కండేయ రక్షపాదం మహాపాదం
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం

ఆత్మలింగ స్వయంపూర్ణా 
ఆత్మలింగ స్వయంపూర్ణుడే 
సాక్షాత్కరించినా  చేయుతనీడినా అయ్యో
అందని అనాధనైతిని మంజునాధా

ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం
ప్రణయ మూలపాదం  ప్రణయ నాట్యపాదం
ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకేలా
ఈ పాదం పుణ్య పాదం ధరనేలే ధర్మపాదం

భక్త శిరియాళు నేలిన ప్రేమపాదం
భక్త శిరియాళు నేలిన ప్రేమపాదం
బ్రహ్మ విష్ణులే భజించే  ఆదిపాదమనాదిపాదం
బ్రహ్మ విష్ణులే భజించే ఆదిపాదమనాదిపాదం

అన్నదాత విశ్వనాధా  
అన్నదాత విశ్వనాధుడే లీలా వినోదిగా
నన్నేలగా దిగిరాగా  హయ్యో
ఛీ పొమ్మంటినే .. పాపినైతినే

ఈ పాదం పుణ్య పాదం ఈ పాదం ధన్యపాదం
సకల ప్రాణ  పాదం సర్వమోక్ష పాదం
తెలుసుకోలేని ఈ నా తెలివేలా ఈ తనువేలా
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం



8, డిసెంబర్ 2012, శనివారం

ఓం మహా ప్రాణ దీపం శివం శివం



ఓం మహా ప్రాణ దీపం శివం శివం 




ఓం మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార  రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌరగాత్రం

మహా కాంతి భీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం  భజే మంజునాథం
ఓం ఓం ఓం నమ: శంకరాయచ
మయస్కరాయచ నమ: శివాయచ
శివతరాయచ  భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం   అర్ఠనారీశ్వరం
త్రిదశ హృదయంగమం  చతుర్దతిసంగమం
పంచభూతాత్మకం  శత్చత్రునాశకం
సప్త స్వరేశ్వరం  అష్ట సిద్దిశ్వరం
నవరస మనోహరం  దశ దిశా సువిమలం

ఏకాదశోజ్వలం   ఏకనాదేశ్వరం
ప్రస్తుతివశంకరం  ప్రనదగణ కింకరం
దుర్జన భయంకరం   సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం  ప్రకృతి హిత కారకం
భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం  రక్షకం

ఈశమ్, సురేశం, ఋషేశం, పరేశం
నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్శమ్

ఓం నమోహరాయచ స్మర హరాయచ 
పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ 
ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ

మహా ప్రాణ దీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

డండండ డండండ డండండ డండండ
డక్కానినాధ నవ తాండవాడంబరం
తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమిదిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల భంబరం

ఓంకార హ్రీంకార  శ్రీంకార  ఐంకార
మంత్రభీజాక్షరం మంజునాదేశ్వరం
రుగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం
సామ ప్రగీతమ్ అధర్మ ప్రగాతం
 పురణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచైక సూత్రం విబుద్దం సుసిద్దం

నకారం మకారం శికారం వకారం యకారం
నిరాకార సాకార సారం
మహా కాల కాలం మహా నీలకంఠం
మహానందనందం మహాటాట్టహాసం

జటాజూటరంగైకగంగాసుచిత్రం
జ్వలద్వుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాసం మహా భానులింగం
మహా వత్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరష్ట్ర సుందరం సౌమనాదేశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం
బైద్యనాదేశ్వరం మహాభీమేశ్వరమ్ 

అమరలింగేశ్వరం రామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం  పరంఘ్రుష్మేశ్వరం
త్ర్యమ్బకాదీశ్వరమ్ నాగలింగేశ్వరం
శ్రీ కేదారలింగేశ్వరం

అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం
వాయులింగాత్మకం అత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం 

అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాదిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం 

 ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిం

ఓం నమ: సోమయచ సౌమ్యయచ
భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ
యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ
రమ్యాయచ  గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వయచా...


Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)