Keblinger

Keblinger

28, జులై 2016, గురువారం

షిరిడీ వాసా సాయి ప్రభో



షిరిడీ వాసా సాయి ప్రభో



షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం

త్రిమూర్తి రూపా ఓ సాయి
కరుణించి మము కాపాడోయి
దరిశన మీయగ రావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా

కఫినీ వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి త్యాగం, సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

చాంద్ పాటిల్ ను కలుసుకొని ఆతని బాధను తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము
అచ్చెరు వొందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫల మిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

నీ ద్వారములో నిలిచితిమి నిన్నే నిత్యము కొలిచితిమి
అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మరీ నాశనము కాపాడి షిరిడీ గ్రామము
అగ్ని హోత్రి శాస్త్రికి  లీలా మహాత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి  పాము విషము తొలగించి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

భక్త భీమాజీకి క్షయ రోగం  నశియించే ఆతని సహనం 
ఊదీ వైద్యం చేశావు  వ్యాధిని మాయం చేశావు
కాకాజీకి ఓ సాయి  విఠల దర్శనమిచ్చితివి
దామూకిచ్చి సంతానం  కలిగించితివి సంతోషం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

కరుణా సింధు కరుణించి  మా పై కరుణా కురిపించు 
 సర్వం నీకే అర్పితము  పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకునే నిను మేఘా  తెలుసుకుని ఆతని బాధ 
 దాల్చి  శివ శంకర రూపం  ఇచ్చావయ్యా దర్శనము 

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

 డాక్టరుకు నీవు రామునిగా బలవంతునకు శ్రీదత్తునిగా
నిమోనికరుకు మారుతిగా   చిదంబరుకు శ్రీ గణపతిగా
 మార్తాన్డుకు  ఖండోబాగా గణూకు సత్య దేవునిగా
నరసింహస్వామిగ జోషీకి దరిశనమిచ్చిన శ్రీ సాయి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

 రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభియించు ముక్తికి మార్గం
పదకొండూ నీ వచనాలు బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

 అందరిలోనా నీరూపం నీ మహిమ అతి శక్తిమయం
ఓ సాయి మేము మూఢులము ఒసగుమయా మాకు జ్ఞానమును
సృష్టికి నీవెనయా మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము  సాయిని కొలిచెదము

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

 భక్తిభావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని
చిత్తముతో సాయీ ధ్యానం చెయ్యండి ప్రతి నిత్యం
బాబా కాల్చిన ధుని ఊది  నివారించును ఆదివ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయే  మన సద్గురువండి

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
 
 వందనమయ్యా పరమేశా ఆపద్భాంధవ సాయీశా
మా పాపములు కడతేర్చు మామది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మేము దరి చేర్చోయీ
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి నాధ్ మహారాజ్  కీ జై




కామెంట్‌లు లేవు:

Related Posts Plugin for WordPress, Blogger...

ॐ స్తోత్రమాలిక ॐ

అన్నమయ్య (1997) (11) అన్నమయ్య అలమేల్మంగా వైభవం (15) అన్నమాచార్య సంకీర్తనలు (41) అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే (1) అమ్మోరు (3) ఓం శ్రీ మాత్రే నమః (33) కార్తీక పురాణం (31) కార్తీకమాసం 2014 (7) క్షీరాబ్ధి ద్వాదశి పూజ విధానము (1) గణేశ స్తోత్రములు (6) గురుపాదుకా స్తోత్రం (1) తిరుప్పావై పాశురాలు - 30 (2) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2014 (10) తిరుమలేశుని బ్రహ్మోత్సవం - 2015 (9) తులసీ స్తోత్రాలు (2) తోటకాష్టకం (1) దత్త బోధ సుధ (1) దేవీ నవరాత్రులు - 2010 (11) దేవీ నవరాత్రులు (2012) (15) దేవుళ్ళు (1) పంచభూత క్షేత్రాలు (2) పద్మశ్రీ Dr. శోభారాజు (8) మహా గణపతిం మనసా స్మరామి (1) మహాచండి (1) మహాదేవి (1) యక్ష ప్రశ్నలు - వాటి జవాబులు (1) రమణ మహర్షి ... (1) వినాయక చవితి పూజ విధానం (2) శివ భక్తిగీతాలు (11) శోభారాజ్ (1) శ్రావణమాసం వరలక్ష్మీ పూజ (2) శ్రీ కృష్ణ స్తోత్రాలు (20) శ్రీ తులసీ స్తోత్రాలు (1) శ్రీ దేవి అష్టోత్తర శతనామావళి (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2016 (11) శ్రీ దేవీ నవరాత్రులు - 2014 (10) శ్రీ దేవీ నవరాత్రులు - 2015 (15) శ్రీ నరసింహ స్వామి స్తోత్రాలు (2) శ్రీ బ్రహ్మ స్తోత్రాలు (1) శ్రీ మంజునాధ (2001) (4) శ్రీ మహాలక్ష్మి (12) శ్రీ రామ గీతాలు (14) శ్రీ రామదాసు (2006) (3) శ్రీ రామదాసు కీర్తనలు (6) శ్రీ రామరాజ్యం (1) శ్రీ విష్ణు - వెంకటేశ్వర స్తోత్రాలు (16) శ్రీ వెంకటేశ్వర భక్తిగీతాలు (11) శ్రీ శివ స్తోత్రాలు (44) శ్రీ సరస్వతీ స్తోత్రాలు (4) శ్రీ సాయి గానామృతం (28) శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం (1) శ్రీ సూర్య భగవాన్ (3) షష్టీ దేవి స్తోత్రం (1) షిరిడీసాయి హారతులు (4) సంక్రాంతి (3) సకల దేవతా స్తోత్రములు (1) సత్యసాయిబాబా (3) స్తోత్ర కదంబం (8) హనుమాన్ (6) హనుమాన్ చాలీసా (1) M.S. సుబ్బలక్ష్మి అన్నమాచార్య కీర్తనలు (1) Sacred Chants by A.R.Rahman (1)