రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
కోసలేంద్రాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం
చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం
లలిత రత్నకుండలాయ తులసీ వనమాలికాయ
జలజ సద్రుశ్య దేహాయ చారు మంగళం
దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
చాపజాత గురువరాయ భవ్య మంగళం
పుండరీకాక్షాయ పూర్ణ చంద్రాననాయ
అండజాత వాహనయ అతుల మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం