శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం మనో బుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం
అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ చిదానంద రూపః శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్ధో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ న వా బన్దనం నైవ ముక్తి న బంధః చిదానంద రూపః శివోహం శివోహం న మృత్యు ర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం
మంత్రమునకు అర్థం " సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను... బంధనాత్ = బంధనం నుంచి ( అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి ); ఉర్వారుకమివ = దోసకాయను వలె ; మృత్యోః = చావునుంచి ; ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక; అమృతాత్ = మోక్షము నుంచి; మా = వద్దు ( వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉందునుగాక ) తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉందును గాక." మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం లోని ఒక మంత్రము.ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము","రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం లోకూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి,మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము. ఈ మంత్రమునకు ఋషి వశిష్టుడు. దేవత శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు). బీజము "హామ్". శక్తి దేవి అమృతేశ్వరి.ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు.